వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సైట్‌లో చంద్రబాబు ఫోటోనా?: దాన్ని కూడా వదలరా.. ఎందుకిలా!

తాజాగా శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వెబ్ సైట్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో దర్శనమివ్వడం ఈ విమర్శలకు తావిస్తోంది.

|
Google Oneindia TeluguNews

తిరుపతి: విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండవద్దన్న విషయం ఏపీ అధికార పార్టీకి అంతగా పట్టనట్లే కనిపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలకు వర్సిటీలో చోటు లేనందునా పరోక్ష దారులు వెతికే పనిలో ఆ పార్టీ నిమగ్నమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వెబ్ సైట్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో దర్శనమివ్వడం ఈ విమర్శలకు తావిస్తోంది.

జగన్‌కు ఉద్యోగం రాదు, బాబుకు అవసరం లేదు: ప్రత్యేక హోదాపై జగన్జగన్‌కు ఉద్యోగం రాదు, బాబుకు అవసరం లేదు: ప్రత్యేక హోదాపై జగన్

యూనివర్సిటీ సైట్.. క్యాంపస్, విద్యా సంబంధిత వివరాలకు వేదికగా ఉండాల్సిందిపోయి, రాజకీయ నాయకుల ముఖచిత్రాలతో కనిపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవిధంగా చంద్రబాబు తరుపున ప్రచారం చేసే పాంప్లెట్ పేజీలా వర్సిటీ వెబ్ సైట్ ను భ్రష్టు పట్టిస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు విద్యార్థి సంఘాల నేతలు కూడా దీనిపై ప్రశ్నిస్తున్నారు.

 why chandrababu naidu photo displaying on svu homepage?

గతంలో ఇలాంటి ధోరణి ఎన్నడూ లేదని, కొత్తగా రాజకీయ నాయకుల ఫోటోలను వర్సిటీ హోంపేజీలపై వాడటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ నేతలైతే.. స్వార్థ రాజకీయ ప్రచారం కోసమే టీడీపీ వర్సిటీని కూడా వదల్లేదని ఆరోపిస్తోంది. వెంటనే వర్సిటీ సైట్ నుంచి చంద్రబాబు ఫోటో తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికీ ఎస్వీయూ యూనివర్సిటీ హోంపేజీలో చంద్రబాబు ఫోటోనే దర్శనమిస్తుండటంతో.. వర్సిటీ అధికారులు సైతం విమర్శలను అంతగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే, గతంలో ఇదే యూనివర్సిటీ క్యాంపస్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుని నారా లోకేష్ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు వర్సిటీల్లో పుట్టినరోజు జరుపుకోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

English summary
YSRCP and some of the student groups criticizing AP CM Chandrababu Naidu for using SVU website for his publicity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X