గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముసులోడివి రాజకీయాలెందుకు - తమ్ముడు పవన్ ఎక్కడా : కేఏ పాల్ సెటైర్లు..!!

|
Google Oneindia TeluguNews

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో తొక్కిసలాట పైన ఆయన స్పందించారు. అసలు చంద్రబాబు సభకు పోలీసులు అనుమతి ఎలా ఇస్తున్నారని నిలదీసారు. ఇదే అమెరికాలో అయితే చంద్రబాబుకు 15 ఏళ్లు పడేదని చెప్పుకొచ్చారు. కందుకూరులో మీటింగ్ పెట్టిన సమయంలోనే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చానని పాల్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇటువంటి సభల నిర్వాహకులు.. వెళ్లే వారికి బుద్ది రావాలంటూ పాల్ వ్యాఖ్యానించారు.

గుంటూరులో తొక్కిసలాట జరిగితే తమ్ముడ పవన్ కల్యాణ్ ఏమయ్యారంటూ ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు పోతున్నా స్పందించరా అంటూ నిలదీసారు. తాను తప్ప ఈ దేశాన్ని..రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరని చెప్పుకొచ్చారు. గుంటూరు లో చంద్రబాబు పాల్గొన్న సభలో తొక్కిసలాటలో గాయపడి చికిత్స సొందుతున్న వారిని కేఏ పాల్ పరామర్శించారు. ఈ తొస్కలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రభుత్వంతో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Why does the old age Chandrababu needs poitics now and where is Pawan Kalyan hiding: KA Paul sattires

ఇప్పటికే ఈ ఘటనతో టీడీపీ లక్ష్యంగా వైసీపీ నేతలు ఆరోపణలు కొనసాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఈ ఘటన పైన స్పందించారు. చంద్రబాబు పైన చర్యలు తీసుకోవాలని మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేసారు. కందుకూరు ఘటన, ఇప్పుడు గుంటూరు ఘటనలు వరుసగా జరగటంతో టీడీపీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నేతల విమర్శలను టీడీపీ తిప్పి కొడుతోంది. కానీ, ఇప్పుడు ముగ్గురు మహిళలు మరణించటం వెనుక పూర్తిగా కార్యక్రమ నిర్వాహకుల వైఫల్యం ఉందని తెలుస్తోంది. దీని పైన కేసు నమోదు చేసిన పోలీసులు చర్యల దిశగా అడుగులు వేస్తున్నారు.

English summary
Prajasanthi Party Chief KA Paul questioned Chandra Babu and PAwan Kalyan ove Guntur incident, sattires on Chandra Babu age.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X