సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇంజిన్ ఆయిల్ ఎందుకు పెట్టారు, చంద్రబాబుకు రిపోర్టు రెఢీ !
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూ సస్పెండ్ అయిన గౌతమ్ తేజ్ అలియాస్ తేజ్ అలియాస్ గౌతమ్ స్టేట్మెంట్ రికార్డు చేసిన ప్రత్యేక టీమ్ పోలీసు అధికారులు ఇప్పటికే అనేక కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు వ్యాపించడానికి విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణం కాదని ఇప్పటికే విద్యుత్ శాఖ సేఫ్టీ విభాగం అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించడానికి పెట్రోల్, డీజల్ ఉపయోగించలేదని ప్రత్యేక అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కంప్యూటర్ విభాగంలో ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారని పోలీసు అధికారులు అధికారులు అంటున్నారు.

పోలీసు అధికారుల విచారణలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఉద్యోగి గౌతమ్ తేజ్ చెప్పిన మాటలకు పోలీసు అధికారులు షాక్ అయ్యారు. తన బీరువాలో ఏడు లీటర్ల ఇంజిన్ ఆయిల్ స్టాక్ పెట్టానని గౌతమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే తన కారుకు ఇంజిన్ ఆయిల్ మార్చడానికి కొత్త అయిల్ తీసుకు వచ్చానని, తరువాత ఆ ఇంజిన్ ఆయిల్ బీరువాలో పెట్టానని గౌతమ్ పోలీసులకు చెప్పాడు.
కారు ఇంజిన్ ఆయిల్ మార్చాలంటే కారులో ఆ అయిల్ పెట్టాలని, లేదంటే ఇంటిలో కాని, మెకానిక్ దగ్గర కాని ఆ అయిల్ ఇవ్వాలని పోలీసు అాధికారులు అంటున్నారు. అయితే ఇంజిన్ ఆయిల్ సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి తీసుకురావడమే కాకుండా దానిని తీసుకెళ్లి బీరువాలో ఎందుకు పెట్టావు అని ప్రశ్నిస్తే సేఫ్టీ కోసం అని గౌతమ్ తేజ్ సమాధానం ఇవ్వడంతో పోలీసులు కంగుతిన్నారని తెలిసింది.

పెట్రెల్, డీజిల్ ఉపయోగిస్తే పోలీసులకు చిక్కిపోతామనే భయంతో కారు ఇంజిన్ ఆయిల్ తీసుకు వచ్చి బీరువాలో పెట్టాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ తేజ్ ను ప్రత్యేక పోలీసు అధికారులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరో వైపు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం కేసు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications