వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Chandrababu 40 ఇయర్స్ ఇండస్ట్రీ..పొలిటికల్ మిస్టరీ : ఢిల్లీకి పోలేరు..అమరావతికి రారు:దెబ్బ తీయగలరా..!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

40 ఇయర్స్ ఇండస్ట్రీ. జాతీయ - రాష్ట్ర రాజకీయాల్లో పండిన నేత. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నేత..ఇప్పుడు మౌనం గా ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తెలంగాణ నేత లు ఏపీలో జల దోపిడీ జరుగుతోందంటూ చేస్తున్న విమర్శల పైన ఎక్కడా స్పందించటం లేదు. ఆయనే కాదు..టీడీపీ నేతలు ఎవరూ దీని పైన మాట్లాడటం లేదు. తెలంగాణ నేతలు వైఎస్సార్..సీఎం జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా ప్రారంభం నుండి కొన్ని సందర్భాల్లో మినహా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు.

Recommended Video

#TopNews : Chandrababu ప్లాన్ విఫలం | Pandem Kodi తరహా లో Rapo 19 || Oneindia Telugu
 జాతీయ రాజకీయాల్లో మిస్సింగ్..

జాతీయ రాజకీయాల్లో మిస్సింగ్..

నేషనల్ ఫ్రంట్..యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చక్రం తప్పిన నేత..ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ దూరంగా ఉంటున్నారు. టీడీపీలోకి ఎంట్రీ నుండి ముఖ్యమంత్రి అయ్యే వరకూ చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు. ఇక, సీఎం అయిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణ..ఇటు ఏపీలోనూ ఆయనకు పోటీ ఎవరూ లేరు. 2004లో వైఎస్సార్ సీఎం అవ్వటంతోనే ఒక్కసారిగా చంద్రబాబు గ్రాఫ్ తగ్గిపోయింది. ఆ తరువాత జరిగిన పరిణామాలు..రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు దూరమైన చంద్రబాబు..ఏపీలో సీఎం అయ్యారు. బీజేపీ...పవన్ తో పొత్తు కలిసి వచ్చింది. అప్పటి వరకు వైఎస్సార్ తో రాజకీయంగా పోరాడిన ఆయన..ఆ సమయం నుండి వైఎస్సార్ కుమారుడితో పోరాటం చేయాల్సి వచ్చింది.

 2019 ఫలితాలతో ఊహించని షాక్..

2019 ఫలితాలతో ఊహించని షాక్..

2019 లో ఊహించని విధంగా జగన్ ఆ ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బ తీసారు. అంతకు ముందే జగన్ ట్రాప్ లో చిక్కుకొని ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. మోదీ తనను కాదని..జగన్ ను దగ్గరకె తీస్తున్నారనే భావనతో ప్రధాని తో రాజకీయంగా వైరం పెట్టుకున్నారు. కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. రాహుల్ తో కలిసి చెట్టా పట్టాల్ వేసుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీని ప్రధాని కాకుండా చేయటమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. కానీ, అక్కడ కేంద్రం..ఇటు ఏపీలో చంద్రబాబు ఊహించని ఫలితాలు వచ్చాయి. అంతే, ఇక ఏపీలో ప్రతిపక్ష నేత పాత్ర కే పరిమితం కావాల్సి వచ్చింది. జగన్ నిర్ణయాల పైన రాజకీయంగా కంటే న్యాయ పోరాటం పైనే టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. కరోనా దెబ్బకు చంద్రబాబు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ అడ్రస్ గల్లంతు అయింది. ఇప్పటికీ...దిద్దుబాటు చర్యలు ప్రారంభం కాలేదు.

 ఢిల్లీ నుండి లేని పలకరింపులు..

ఢిల్లీ నుండి లేని పలకరింపులు..

ఇక, అప్పుడే టార్గెట్ 2024 పేరుతో జాతీయ రాజకీయాల్లో సమావేశాలు..కూటముల లెక్క లు మొదలయ్యాయి. కాంగ్రెస్-బీజేపీ ఇతర పార్టీల సమావేశం అంటే ముందుగా దక్షిణాది నుండి ముందుండే పేరు చంద్రబాబు నాయుడు. కానీ, శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి చంద్రబాబుకు పిలుపు లేదు. ఆయన బీజేపీతో 2019 లో వ్యతిరేకించారు. కాంగ్రెస్ తో దగ్గరయ్యారు. ఇప్పుడు ఎవరితో ఉన్నారో అర్దం కాని పరిస్థితి. బీజేపీకి దగ్గరవుతనే..జగన్ ను దెబ్బ తీయగలమనే నమ్మకం. చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా..తాము కలిసే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు ఢిల్లీకి కూడా వెళ్ల లేదు. ఇక, కాంగ్రెస్ తో కలిసే సమస్యే లేదు.

 సమయం మనది కాదు..నిరీక్షించాల్సిందే..

సమయం మనది కాదు..నిరీక్షించాల్సిందే..

ఏపీలో పార్టీ..కుమారుడి భవిష్యత్ కీలకం కావటంతో ఇక ప్రతీ అడుగు కీలకమే. దీంతో..మోదీని అవకాశం వస్తే ప్రశంసించటమే కానీ...విమర్శలు లేవు. జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు లేవు. ఇక, తెలంగాణలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే సైకిల్ దిగుతున్నా ఆపే ప్రయత్నాలు జరగటం లేదు. ఏపీలో..సమయం కోసం నిరీక్షణ. తాజా జల జగడంలో జగన్ ఎంత వరకు డామేజ్ అవుతారనేదే టీడీపీ లెక్కలు కడుతోంది. స్పందించకుంటే ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం కలుగుతుందనే అంశం విస్మరిస్తున్నారు. అయితే, జగన్ పైన వ్యతిరేకత ఏర్పడిందనే లెక్కలతో నెట్టుకొస్తున్నారు.

 భవిష్యత్ పై ధీమా..కలిసొచ్చేదెవరు..

భవిష్యత్ పై ధీమా..కలిసొచ్చేదెవరు..

రాజకీయంగా సంక్షోభం తమకు కొత్త కాదని చెబుతున్నారు. మరి.. వచ్చే మూడేళ్ల కాలంలో తిరిగి సత్తా చాటుతారా..రాజకీయ చాణక్యగా చెప్పుకొనే చంద్రబాబుకు రానున్న రోజుల్లో కలిసొచ్చే దెవరు..జగన్ ను ఎదుర్కొనే మంత్రం ఏంటి...ఇక , ఢిల్లీ రాజకీయాలకు బైబై చెప్పేసినట్లేనా...2019 నాటి ఫలితాలకు ధీటుగా చంద్రబాబు రానున్న రోజుల్లో అటు కేంద్రంలో...ఇటు ఏపీలో దెబ్బకు దెబ్బ తీయగలరా... వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.

English summary
Chandra Babu silence on national politics beacame hot discussion in political circles. Modi and Team not willing to work again with CBN. In AP also TDP in political struggle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X