స్వచ్ఛ భారత్: పవన్ కళ్యాణ్‌ను మోడీ విస్మరించారా?
హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కార్యక్రమం విషయంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోలేదా అనే చర్చ తెలుగు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి ‘స్వఛ్ భారత్' కార్యక్రమం ప్రారంభిస్తూ 9 మంది సెలబ్రిటీలు అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా, కమలహాసన్, సచిన్ టెండూల్కర్ వంటివారికి సవాల్ విసిరారు.
అయితే, మోడీ జాబితా తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారెవరూ లేరు. మిమ్మల్ని ప్రధానిగా చూడాలనుకుంటున్నామటూ ఎన్నికల వేళ పనిగట్టుకుని పర్యటనలు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడం వల్లనే మోడీ ఆ జాబితాలో చేర్చలేదా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.

తమ హీరోను మోడీ పట్టించుకోకపోవడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు గరంగరంగా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల వేళ కనీసం మద్దతు కూడా తెలుపని కమల్ హాసన్ వంటి హీరోకు ఇచ్చిన సవాల్ తమ అభిమాన హీరోకు లేకపోవడమేమిటని వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే మరికొందరు మాత్రం స్వఛ్ భారత్ కార్యక్రమంలో కాకుండా మరో భారీ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్‌ను నరేంద్ర మోడీ ఎంపిక చేసుకున్నారనీ, అప్పుడు పిలుస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పేరు చేర్చకుండా మరో తెలుగు సెలిబ్రిటీ పేరు చేర్చడం బాగుండదనే ఉద్దేశంతోనే మొత్తంగానే తెలుగు సినీ పరిశ్రమను మోడీ వదిలేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications