జగన్‌పై విమర్శలు చేసే సాహసం చేయని మోదీ.. కేంద్ర నిఘా సంస్థల నివేదికలో ఏముంది..?
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీని ఢీ కొట్టడానికి టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా కూటమి పని చేస్తుందని నేతలు ప్రకటించారు. అయితే ఆదివారం మూడు పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార సభ జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఎన్డీఏను ఆశీర్వదించాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేస్తారని భావించిన చంద్రబాబు, పవన్‌లకు తీవ్ర నిరాశే ఎదురైంది.
వైసీపీ , కాంగ్రెస్ రెండు ఒక గూటి పక్షులే అని చెప్పిన మోదీ..ఈ రెండు పార్టీలను రాష్ట్రంలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులే సారథులుగా ఉన్నారంటూ జగన్, షర్మిలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని..రాష్ట్రం అభివృద్ధిపథంలో నడవాలంటే కూటమిని ఆశీర్వదించాలని ప్రధాని మోదీ ఏపీ ప్రజలను కోరారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ,పవన్ కల్యాణ్ నాయకత్వాల గురించి మోదీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు తీవ్ర నిరాశలో కురుకుపోయారు.

అయితే ప్రధాని మోదీ వైసీపీ సర్కార్ పెద్దగా విమర్శలు చేయడానికి అనేక కారణాలున్నట్టు తెలుస్తోంది. మోదీతో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా జగన్‌తో మోదీ మైత్రీని కొనసాగించిన పరిస్థితి. అయితే ఎన్టీఏలో చేరడానికి వైసీపీకు పలుమార్లు ఆఫర్ ఇచ్చినప్పటికీ .. దాన్ని జగన్ సున్నితంగా తిరస్కరించారు. ఇదే సమయంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించడం , దీనికి పవన్ కల్యాణ్ రాయబారం నడపటంతో, టీడీపీ ఎన్డీఏలో చేరేలా చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి.
ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ పెద్దగా విమర్శలు చేయకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు వెలువడిన మెజార్టీ సర్వేలు వైసీపీనే తిరిగి అధికారంలోకి వస్తాయని ప్రకటించాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికలో సైతం వైసీపీనే గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలడంతోనే ..జగన్ సర్కార్ మీద మోదీ విమర్శలు చేసే సాహసం చేయలేదని తెలుస్తోంది.

దీనికి తోడు రాజ్యసభలో బీజేపీకి సరైన మద్దతు లేకపోవడం..ఇదే సమయంలో వైసీపీకి పూర్తి స్థాయిలో రాజ్యసభ సభ్యుల బలం ఉండటం కూడా మోదీ వైసీపీపై విమర్శలకు చేయకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఈ కారణంగానే జగన్‌పై మోదీ విమర్శలు చేయలేదని టీడీపీ , జనసేన నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనైనా జగన్ టార్గెట్‌గా బీజేపీ నేతలు విమర్శలు చేయాలని టీడీపీ , జనసేన శ్రేణులు కోరుకుంటున్నాయి.టీడీపీ , జనసేన కోరుకుంటున్నట్టుగా వచ్చే సభల్లోనైనా బీజేపీ నాయకులు జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తారేమో చూడాలి.












Click it and Unblock the Notifications