ధర్మారెడ్డి మౌనం వెనుక - అడ్డుకుంటుందెవరు..!!
తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఈ వివాదం మీద సిట్ ఏర్పాటు చేసింది. మాజీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. తిరుమలలో మహా యాగం నిర్వహిస్తున్నారు. లడ్డు వివాదంపై ఎంత రచ్చ జరుగుతున్నా మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు. ఆయన మౌనం వెనక కారణమేంటి. ఏం జరుగుతోంది.
తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత ప్రభుత్వం.. టీటీడీ పాలక మండలి.. నాడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ వ్యవహారం పైన తాజాగా ప్రభుత్వం విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. అటు మాజీ సీఎం జగన్ రాజకీయం కోసమే చంద్రబాబు ఈ వివాదం సృష్టించారని ప్రధానికి లేఖ రాశారు. తిరుమలలో హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంత వివాదం జరుగుతున్నా టిటిడిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేసిన ధర్మారెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు.

లడ్డు వివాదం పైన నాడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వై వి సుబ్బారెడ్డి, భూమన స్పందించారు. విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ కోసం సుబ్బారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ధర్మారెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశారు. ధర్మారెడ్డి తన కుమారుడు చనిపోతే 12వ రోజు తిరుమలకు వచ్చారని.. ఆలయ సాంప్రదాయాలను విస్మరించారని మండిపడ్డారు. ధర్మారెడ్డి తీరు పైన గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అన్ని విషయాలపైన విచారణ చేయనుంది. అందులో ధర్మారెడ్డిని సైతం విచారించే అవకాశం కనిపిస్తుంది.
టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి పనిచేసిన సమయంలో అధికార పార్టీ నేతలను పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో అధికారం మారిన తర్వాత ధర్మారెడ్డి పదవి విరమణ చేశారు. అయితే ప్రస్తుతం తిరుమలకు నెయ్యి ఒప్పందాల పైన నాడు జరిగినది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ధర్మారెడ్డి ఆ సమయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటివరకు ఆయన ఏం జరిగింది అనేది బయటికి వచ్చి చెప్పటం లేదు. దీంతో ధర్మారెడ్డి మౌనం వెనుక అసలు కారణమేంటని చర్చ మొదలైంది. ధర్మారెడ్డి ఇప్పటికైనా బయటికి వస్తారా.. ఏం జరిగింది.. ఏం జరుగుతోంది అనేది వివరించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications