వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ముగ్గురు చంద్రబాబుకు మిత్రులే, కానీ..ఎందుకు బాబును వ్యతిరేకిస్తున్నారు

చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ముగ్గురు మిత్రులున్నారు. వారు కూడ టిడిపిలోనే కొనసాగుతున్నారు.అయితే మిత్రులు చేసే పనులు చంద్రబాబు పార్టీకి కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి: చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ముగ్గురు మిత్రులున్నారు. వారు కూడ టిడిపిలోనే కొనసాగుతున్నారు.అయితే మిత్రులు చేసే పనులు చంద్రబాబు పార్టీకి కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.

అంబేద్కర్ జయంతి రోజున చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలపై బాబు సీరియస్ గా ఉన్నారు.దళితులకు ఏం చేయడం లేదని శివప్రసాద్ చేసిన విమర్శలను బాబు ఆషామాషీగా తీసుకోలేదు.

మరో వైపు మంత్రివర్గం నుండి తప్పించినందుకు ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఈ విషయమై తన రాజీనామాను వెనక్కు తీసుకొంటున్నట్టు ఆయన ప్రకటించారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడ పార్టీలో చంద్రబాబుతో ఉన్నారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఎన్ టి ఆర్ తో , తర్వాత కొంతకాలం పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. తర్వాత ఆయన తిరిగి టిడిపిలో చేరారు.

ముగ్గురు మిత్రుల కథ

ముగ్గురు మిత్రుల కథ

చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి ప్రజా ప్రతినిధులు స్నేహితులు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడులు మంచి మిత్రులు. ఈ ముగ్గురు టిడిపిలోనే ఉన్నారు.

అయితే ఈ ముగ్గురు అప్పుడప్పుడూ వ్యవహరించే తీరు చంద్రబాబుకు కష్టాలను కొనితెచ్చిపెడుతోంది.తమ మాట వినాలనో, మాట వినడం లేదంటున్నారనో బాబుపై వీరు ముగ్గురు బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతున్నాయని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ముగ్గురిదీ ఒకే మాట, ఒకే బాట

ముగ్గురిదీ ఒకే మాట, ఒకే బాట

రాజకీయాల్లో చేరిన కొత్తలో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.ఆ సమయంలో ఆయన అంజయ్య మంత్రివర్గంలో కొంతకాలంపాటు మంత్రిగా వ్యవహరించారు.

ఆనాటి నుండే వీరందరూ కూడ ఒకే జట్టుగా వ్యవహరించేవారు.అయితే పార్టీలు వేరైనా వారంతా చంద్రబాబునాయుడుతో కలిసిమెలిసి ఉన్నారు.అయితే పార్టీలు మారినా కాని, స్నేహంలో మాత్రం వారు జట్టు వీడలేదు. గాలిముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు జంట సోదరులుగా తిరిగేవారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో వారిద్దరూ కలిసేవెళ్ళేవారు. కలిసే వచ్చేవారు.స్నేహంలో మాత్రం వారు వీడలేదు.

ముగ్గురు మిత్రులకు బాబుపై కోపం

ముగ్గురు మిత్రులకు బాబుపై కోపం


చంద్రబాబుతో కలిసి మెలిసి ఉన్న ఈ ముగ్గురు మిత్రులు ప్రస్తుతం చంద్రబాబు తీరుతో అలకబూనారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో చంద్రబాబునాయుడు తనతో పాటు గా చిత్తూరు జిల్లా నుండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.అయితే అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన ఇటీవల బొజ్జలను మంత్రివర్గం నుండి తప్పించారు. దీంతో ఆయన బాబుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.మరో వైపు దళితులకు అన్యాయం చేస్తున్నారని, సముచిత స్థానం కల్పించడం లేదని బాబుపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.మరో వైపు ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడ మంత్రివర్గంలో చోటు కోసం కొంత అసంతృప్తిగా ఉన్నారు.

ముగ్గురు మిత్రులకు బుజ్జగింపులు

ముగ్గురు మిత్రులకు బుజ్జగింపులు

ముగ్గురు మిత్రులు బాబుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నందున వారిని బుజ్జగించే పనిలో చంద్రబాబునాయుడు ఉన్నారు. మంత్రివర్గం నుండి తప్పించినందకు అలక వహించిన బొజ్జలగోపాలకృష్ణారెడ్డి ఎట్టకేలకు తన అలకను వీడారు. తన రాజీనామాను వెనక్కు తీసుకొంటున్నట్టు ప్రకటించారు.మరో వైపు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యవహరశైలిపై బాబు ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయమై బాబు క్రమశిక్షణ చర్యలు తీసుకొంటాననే సంకేతాలు ఇచ్చారు. అయితే తన స్థాయికి తగ్గ పదవి ఇవ్వడం లేదనే అసంతృప్తి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు నెలకొంది.అయితే ఆయనకు పార్టీ బాధ్యతలను కట్టబెట్టే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

English summary
why three friends of Chandrababu Naidu angry on him,Gali Muddu Krishnama Naidu, Bojjala Gopala Krishna Reddy, Shivaprasad best friends of Chandrababu Naidu.they were angry on Chandrababu Naidu for various reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X