వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను ‘బీకాంలో ఫిజిక్స్’ జలీల్ ఖాన్‌తో ఎందుకు పోలుస్తున్నారు?: ఏం జరిగింది?

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan In 'B.com Physics' List After Jaleel Khan, Video Goes Viral

నెల్లూరు: ఆదాయపు పన్నుపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు.

రాజీనామా చేద్దాం-కలిసే సాధిద్దాం, ఆ ఎమ్మెల్యేను ఎన్‌కౌంటర్ చేస్తే..: బాబుకు జగన్ సవాల్రాజీనామా చేద్దాం-కలిసే సాధిద్దాం, ఆ ఎమ్మెల్యేను ఎన్‌కౌంటర్ చేస్తే..: బాబుకు జగన్ సవాల్

పలువురు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తూ 'బీకాంలో ఫిజిక్స్' ఎమ్మెల్యేతో పోలుస్తుంటే.. మరికొందరు జగన్ చేసిన వ్యాఖ్యల్లో కొంత వాస్తవం లేకపోలేదని అంటున్నారు.

చర్చనీయాంశంగా జగన్ వ్యాఖ్యలు

చర్చనీయాంశంగా జగన్ వ్యాఖ్యలు

ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను కట్టే అవసరం ఉండదని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వెబ్‌ ఛానల్‌తో వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దిమ్మ తిరిగి మైండ్ బ్లాంకైంది! కేసీఆర్ కాళ్లు పట్టుకున్నావు: బాబుపై రోజా, మిథున్ సంచలనందిమ్మ తిరిగి మైండ్ బ్లాంకైంది! కేసీఆర్ కాళ్లు పట్టుకున్నావు: బాబుపై రోజా, మిథున్ సంచలనం

జలీల్ ఖాన్‌తో పోలుస్తూ..

జలీల్ ఖాన్‌తో పోలుస్తూ..

ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను మినహాయింపు వస్తుందని ఏ చట్టంలో ఉందని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక, బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పి.. వైరల్ అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌తో జగన్‌ను పోల్చుతూ సెటైర్లు వేస్తున్నారు.

ప్యాకేజీకి అందుకే ఒప్పుకున్నా! పార్టీ నేతలపై ఆగ్రహం-ఎంపీలకు ప్రశంస: తేల్చేసిన చంద్రబాబుప్యాకేజీకి అందుకే ఒప్పుకున్నా! పార్టీ నేతలపై ఆగ్రహం-ఎంపీలకు ప్రశంస: తేల్చేసిన చంద్రబాబు

ఈ మాత్రం తెలియదా?

ఈ మాత్రం తెలియదా?

ఆదాయపు పన్ను మినహాయింపు ప్రత్యేక హోదా వల్ల రాదని అందరికీ తెలిసిన విషయమే అయినా.. వైసీపీ అధినేత జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం కూడా ఆయనకు తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తప్పుగా అర్థం చేసుకున్నారంటూ..

తప్పుగా అర్థం చేసుకున్నారంటూ..

కాగా, మరికొంతమంది నెటిజన్లు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నారు. అంతేగాక, హోదా వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే కంపెనీలు పన్ను కట్టాల్సిన అవసరం పరిమిత కాలం వరకు ఉండదని, అదే జగన్ చెప్పారని చెబుతున్నారు.

‘హోదా’.. దేవుడిపైనే భారం

‘హోదా’.. దేవుడిపైనే భారం

హోదా వస్తే ఎన్నో ప్రజయోజనాలున్నాయంటూ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా వస్తే ఏపీలోని ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతుందని ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తారా? అని వైసీపీకి చెందిన కార్యకర్త అడిగితే మాత్రం.. దేవుడిపై భారం వేయాలని జగన్ చెప్పిన సమాధానం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English summary
Why was YSRCP president YS Jaganmohan Reddy compared with MLA Jaleel Khan?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X