వైసీపీ ఎంపీల రాజీనామాలు ఉత్తవే, ఎన్నికలొస్తాయి: జెసి దివాకర్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని తీసుకొన్న నిర్ణయంతో పెద్దగా ప్రభావం ఉండదని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఉత్తవేనని జెసి అభిప్రాయపడ్డారు.

పవన్‌కు షాక్: ఏ అధికారంతో లెక్కలడుగుతున్నారు: విష్ణు సంచలనం

ప్రత్యేక హొదా అంశాన్ని తీసుకొని తమ పార్టీకి చెందిన ఎంపీలతో ఏప్రిల్ 6వ, తేదిన రాజీనామాలను చేయించనున్నట్టు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు.అయితే వైసీపీ రాజీనామాల అంశాన్ని టిడిపి ఎ:పీ జెసి దివాకర్ రెడ్డి నాటకంగా అభిప్రాయపడ్డారు.

జెఎఫ్‌సిపై ట్విస్టిచ్చిన బాబు: అందుకే ప్యాకేజీకి ఒప్పుకొన్నా, జగన్ అప్పుడేం చేశారు?

వైసీపీ ఎంపీలతో రాజీనామాల నాటకాన్ని తెరమీదికి తీసుకొచ్చిందని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు జెసి దివాకర్ రెడ్డి వైసీపీ ఎంపీల రాజీనామాలపై స్పందించారు.

పవన్‌వి టైంపాస్ రాజకీయాలు, ఉండవల్లి రిటైర్డ్ టీచర్, జెపి విఫలనేత: కత్తి మహేష్ సంచలనం

 వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాలు

వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాలు

వైసీసీ ఎంపీలు రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంత కాలం రాజీనామాలు చేయకుండా ఇప్పుడు రాజీనామాలు చేస్తామని చెప్పడంలో ఆంతర్యమేమిటని జెసి దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. రెండేళ్ళ క్రితమే రాజీనామాలు చేస్తామని చెప్పిన వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ రాజీనామాలతో ఒరిగేదేమీ ఉండదన్నారు.

పోరాటంలో వెనుకబడ్డామని రాజీనామాలు

పోరాటంలో వెనుకబడ్డామని రాజీనామాలు

ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో పార్లమెంట్ బయట, లోపల వెనుకబడ్డామనే కారణంగా వైసీపీ నేత జగన్ ఎంపీల రాజీనామా అంశాన్ని తీసుకొచ్చారని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పడుు రాజీనామాలంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

 ఎన్నికలొస్తాయి

ఎన్నికలొస్తాయి

ఏప్రిల్6వ, తేదిన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే , వాటిని ఆమోదించేందుకు రెండు మాసాలు పట్టే అవకాశం ఉందన్నారు. ఆ లోపుగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ రాజీనామాల డ్రామాను తెరమీదికి తెచ్చిందని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.

రాజీనామాల ప్రభావం ఉండదు

రాజీనామాల ప్రభావం ఉండదు

వైసీపీ ఎంపీల రాజీనామాల ప్రకటనను ఎవరూ పట్టించుకొనే పరిస్థితి ఉండదని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.టిడిపికి చెందిన కొందరు ఎంపీలు కూడ రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమై నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp Mp Jc Diwakar Reddy said that no one believe on Ysrcp mps resignations. .why ysrcp mp's not resign two years back.He spoke to media on Tuesday evening.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి