మంచి చేస్తే ఇలాగా: దేవినేని, జగన్ భయపడుతున్నారని

హైదరాబాద్: ప్రజలకు మంచి చేస్తే తమ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తారా? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు, డ్వాక్రా రుణాలను తాము మాఫీ చేశామన్నారు.

లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మాఫీ చేశామని చెప్పారు. జగన్‌కు తమను ప్రశ్నించే అర్హత లేదన్నారు. కృష్ణా జలాల పైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని చెప్పారు. న్యాయపరంగా రావాల్సిన కేటాయింపులు వచ్చేలా చూస్తామని చెప్పారు.

Why YSRCP planning to burn effies: Devineni

చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేయమంటూ జగన్ పిలుపునివ్వడంపై దేవినేని ఉమా మండిపడ్డారు. అవినీతిపై కేసులు నమోదైన జగన్‌కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. టీడీపీ రుణాలు మాఫీ చేస్తే రైతులు ఓటేయరని జగన్ భయపడుతున్నారని యనమల అన్నారు.

రుణమాఫీ చేయలేమని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రైతురుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయనుండటంతో... జగన్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. భవిష్యత్తులో తమ పార్టీకి ఓట్లు పడవని జగన్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలకు చెందిన లక్షలాది ఎకరాలను ధనవంతులకు ధారాదత్తం చేసిన ఘనత జగన్‌దే అన్నారు. 10 ఛార్జ్‌షీట్లలో జగన్‌పై 420 కేసులున్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+