రెండో పెళ్లికి సిద్ధపడిన భర్తపై శివమెత్తిన మహిళ
ఏలూరు: రెండో పెళ్ళికి సిద్ధపడిన భర్తను భార్య కాలర్ పట్టుకుని నిలదీసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో పుణ్యక్షేత్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల రంగప్రవేశంతో జీలకర్ర బెల్లం సీనుతో ఆ పెళ్లి నిలిచిపోయింది.
రాజమండ్రికి చెందిన లంక సురేంద్రమోహన్ శుక్రవారం ఉదయం శ్రీవారి తూర్పు రాజగోపుర ప్రాంతంలో విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన ఒక యువతిని వివాహం చేసుకుంటున్నాడు. జీలకర్ర, బెల్లం ఘట్టం పూర్తయిన తరువాత తాళి కట్టడానికి కొన్ని క్షణాల ముందు ఒక యువతి పోలీసులతో కలిసి అక్కడకు చేరుకుంది.
తాను సురేంద్రమోహన్ భార్యనని, ఈ పెళ్లి నిలిపేయాలని చెప్పడంతో గందరగోళం ఏర్పడింది. విశాఖ జిల్లాకు చెందిన తనకు సురేంద్ర మోహన్‌తో పదేళ్ల క్రితం వివాహమైందని, ఒక ఆడపిల్ల కూడ ఉందని ఆ మహిళ అన్నది. సురేంద్ర విశాఖపట్నంలో ఒక పాఠశాలలో టీచర్‌గా పనిచేశాడని, అ తరువాత ఉద్యోగం మాని ఇంటి వద్దనే ఉంటున్నాడని చెప్పింది. తనకు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఏడేళ్ల క్రితం ఇద్దరూ హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డామని తెలిపింది.

అయితే తాను ఎవరితో మాట్లాడినా అనుమానించి హింసించేవాడని, అశ్లీల వీడియోలు చూస్తూ వేధించేవాడని విమర్శించింది. మరో యువతికి ఈ దుస్థితి రాకూడదని తెలిపింది. ఈ గందరగోళం నడుమ పెళ్లి పీటలపై ఉన్న సురేంద్ర అక్కడ నుండి జారుకుంటుండగా ఆమె వెంట పడి అతని కాలర్ పట్టుకుని నిలదీసే ప్రయత్నం చేసింది. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.
తన భార్య ప్రవర్తన మంచిది కాదని సురేంద్ర ఆరోపించాడు. దీంతో వివాహం చేసుకుంటున్నానని చెప్పాడు. అక్కడ నుండి వెళ్లిపోతుండగా పోలీసులు అతడిని నిలువరించారు. భీమడోలు సిఐ ఎం వెంకటేశ్వరరావుకు విషయాన్ని ఫోనులో వివరించారు. ఆయన ఆదేశాల మేరకు వారి నుండి వివరాలు సేకరించి వదిలేశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications