భర్తను చంపేసిన భార్య: కప్పిపుచ్చేందుకు యత్నం, ఎందుకు..

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: భర్తలను హత్య చేసిన భార్యల ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ భార్య తన భర్తను చంపేసింది. అయితే, ఈ హత్య ఆ కోవలోకి రాదు. ఆస్తి గొడవలో భార్య భర్తను చంపేసిన ఘటన ఇది.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో కొరసవాడలో భర్తపై భార్య దాడి చేసింది. ఈ దాడిలో భర్త మరణించాడు. కొరసవాడ గ్రామంలోని కర్ణం వీధిలో పూర్ణచంద్ర పాణిగ్రహీ(52), కుంతల పాణిగ్రహీ అలియాస్‌ సుహాసిని దంపతులు నివాసం ఉంటున్నారు.

క్షణికావేశంతో దాడి

క్షణికావేశంతో దాడి

ఆస్తి విషయంలో భార్యాభర్తలు ఆదివారం రాత్రి గొడవ పడ్డారు. ఈ గొడవలో క్షణికావేశంతో భార్య భర్తపై ఇనుపరాడ్‌తో దాడి చేసిది. తలపై బలంగా దెబ్బ తగలడంతో పూర్ణచంద్ర పాణిగ్రాహి అక్కడికక్కడే మరణించాడు. పూర్ణచంద్రకు నలుగురు అన్నదమ్ములు. వారిలో ఇద్దరు ఇప్పటికే మరణించారు.

అదే తగాదాకు కారణమైంది...

అదే తగాదాకు కారణమైంది...

పూర్ణచంద్ర పాణిగ్రహీ, ఓ అన్నయ్య గ్రామంలోనే వేర్వేరుగా నివసిస్తున్నారు. ప్రస్తుతం పూర్ణచంద్ర పాణిగ్రహీ కుటుంబం నివాసం ఉంటున్న ఇల్లు విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం చెలరేగింది. దీనిపై పూర్ణచంద్ర పాణిగ్రాహి దంపతుల మధ్య రెండేళ్లుగా గొడవ జరుగుతోంది. ఆ ఇంటిని తన పేర రాయాలని కుంతల గొడవ చేస్తూ వస్తోంది

పోలీసులకు కూడా ఫిర్యాదు

పోలీసులకు కూడా ఫిర్యాదు

ఇంటి విషయంపైనే గతంలో కుంతల స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దాంతో ఒకే ఇంట్లో భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు కూడా భార్యాభర్తల మధ్య ఇంట్లో రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు గొడవ జరిగింది. ఆ సమయంలో భార్య కుంతల ఇంట్లోని గ్యాస్‌ స్టౌ పక్కనే ఉన్న ఇనుప రాడ్‌ను తీసుకుని భర్త తలపై బలంగా కొట్టింది. దాంతో ్తను అక్కడికక్కడే అతడు మరణించాడు. ఆ సమయంలో ఇంట్లో కూతురు మాధురి పాణిగ్రహీ ఉంది. వెంటనే సుహాసిని తన తల్లి కుమారి పండాకు ఫోన్‌ చేసింది.

ఆమె ఇలా చేసింది..

ఆమె ఇలా చేసింది..

విషయం తెలిసిన పూర్ణచంద్ర తల్లి, తమ్ముడు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించాడు. అయితే, భార్య కుంతల తన వ్యవహారం తెలియకూడదని మృతదేహంపై కిరోసిన్‌పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె పాచిక పారలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman in Srikakulam district has killed her husband in a property dispute.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి