ఎన్నిక‌ల వ‌ర‌కు జ‌నం తోనే ఉంటా...! బుల్లెట్ వేగంతో దూసుకెళ్తా..! అంటున్న జ‌న‌సేనాని..!!

హైద‌రాబాద్: ఇక ప్ర‌జాక్షేత్రంలో ఆయ‌న 24x7. ప్ర‌తి నిత్యం జ‌నాల మ‌ద్యే కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న‌. 2019 సాధార‌ణ ఎన్న‌క‌ల వ‌ర‌కు జ‌నంతో నే ప‌వ‌న్. అవును.. ఈ వార్త వంద‌కు వంద శాతం నిజం.. వ‌చ్చే సెప్టెంబ‌ర్ నుంచి జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌నం మ‌ద్య‌లోనే ఉండ‌బోతున్నారు. దీర్గ‌కాలిక ప్ర‌జా యాత్ర కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టి ప్ర‌ల‌తో మ‌మేకం రావాల‌ని కోరుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ చేసిన బ‌స్సు యాత్రకు అనూహ్య బ్రేకులు ప‌డుతూ వ‌చ్చింది. గ‌త ఆరు నెల‌లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉత్త‌రాంద్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న అనుకున్నంత ప్ర‌జాధ‌ర‌ణ రాలేద‌నే భావ‌న జ‌న‌సేన వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి. దీంతో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చేంత వ‌ర‌కు జ‌న‌సేనాని నిర్విరామంగా జ‌నంలో ఉండేలా ప్ర‌ణాళిక రిచిస్తున్నారు.

ఇక నిత్యం ప్ర‌జ‌ల‌తో..! తాడో పేడో ప్ర‌జా క్షేత్రంలేనే..!

ఇక నిత్యం ప్ర‌జ‌ల‌తో..! తాడో పేడో ప్ర‌జా క్షేత్రంలేనే..!

రానున్న సెప్టెంబర్ 12 నుంచి అంతరాయం లేకుండా, విశ్రాంతనేదే లేకుండా ఎన్నికల వరకూ నిరంతరంగా యాత్ర చేపట్టాలని పవన్ నిర్ణయించుకున్నారట. దీనిపై జనసేన వర్గాలు త్వరలోనే అధికారికంగా కూడా ధృవీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. అలాగే దాదాపు ఏడు నెలల పాటు సాగనున్న ఈటూర్ కి భారీగానే ఏర్పాట్లు పూర్తయ్యాయట. పవన్ తాను దగ్గర ఉండి తయారు చేయించుకున్న రధంలోనే ఈ టూర్ ప్లాన్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అత్తారింటికి సెల‌వ్..! జ‌నంతో రాంబాబు..!!

అత్తారింటికి సెల‌వ్..! జ‌నంతో రాంబాబు..!!

ఇక అన్ని రకాల హంగులతో ఈ రధం తయారయ్యింది అని పవన్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే పవన్ ఇంతవరకూ జరిగిన మాదిరిగా కాకుండా అంతరాయం లేకుండా యాత్ర చెయ్యాలి అని ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. ఇంతవరకూ పవన్ చేస్తున్న యాత్ర పెద్దగా ఫోకస్ లో లేకపోవడంతో ఆ రకంగాను పబ్లిసిటీని తారాస్థాయికి తీసుకు వెళ్లే విధంగా సైతం పవన్ సైన్యం అప్రమత్తం అయినట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇక నో సిల్లీ రీజ‌న్స్..! అంతా సీరియ‌స్..!

ఇక నో సిల్లీ రీజ‌న్స్..! అంతా సీరియ‌స్..!

వినడానికి ఈ వార్త బాగానే ఉన్నప్పటికీ, సాధ్యం అవుతుందో లేదో అన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ధర్మ పోరాట యాత్ర పేరుతో పవన్ హడావుడి చేస్తూ వచ్చారు. కొద్ది రోజులు టూర్, మరి కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలి అనే ఆలోచనతో ఇన్నాళ్లూ పవన్ ఉన్నారని అంటున్నారు. అలాగే తన సెక్యూరిటీ టీమ్ కు గాయాలు అయ్యాయంటూ ఆయన టూర్ ఆపేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి పవన్ ఏకంగా రిసార్ట్ కే పరిమితం ఐన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి.

 ప్ర‌జ‌ల‌తోనే ప‌వ‌న్..! రాజ‌కీయ వ‌ర్గాల్లో గుబులు..!!

ప్ర‌జ‌ల‌తోనే ప‌వ‌న్..! రాజ‌కీయ వ‌ర్గాల్లో గుబులు..!!

ఇలా రకరకాల కారణాలతో అడపాదడపా యాత్ర సాగడంపై పవన్ కూడా సంతృప్తి లేనట్టు తెలుస్తోంది. మరోవైపు తన యాత్రలపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో నిరంతర యాత్ర చేపట్టాలని పవన్ బలంగా ఫిక్స్ అయ్యారట. మరోవైపు ఇక అన్ని జిల్లాల నుంచి బడా నాయకులను, వారి వారసులను పవన్ తన పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ వేస్తున్న ఈ ప్రణాళికలన్నీ వర్క్ అవుట్ అయితే ఏపీలో రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు త‌ప్ప‌ద‌నే అభిప్ర‌యాలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+