వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి ఊహించని షాక్: బడ్జెట్ ఎఫెక్ట్, పవన్ మార్గం.. ఢిల్లీ స్థాయిలో మళ్లీ బాబు చక్రం?

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలు అంతా ఆగ్రహోద్రులవుతున్నారు. చంద్రబాబు నేతలతో అత్యవసరంగా భేటీ అవుతున్నారు. బీజేపీతో పొత్తు విషయమై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

Recommended Video

పవన్ దెబ్బకు దిగొచ్చిన మోడీ? బీజేపీతో తెంచుకుందామని బాబు !

బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?

తెలుగుదేశం పార్టీ మాట తీరు చూస్తుంటే త్వరలో బీజేపీకి రాం రాం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు నేతలు ఓపిక పడదామని సూచనలు చేస్తున్నప్పటికీ, ఇంకా ఎన్నాళ్లని ఓపిక పడతామని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే, ఏపీకి ఏమీ చేయని బీజేపీతో కలిసి నడిస్తే 2019లో ప్రజలు మనకూ కూడా బుద్ధి చెబుతారని అంటున్నారు.

బాబును తక్కువ అంచనా వేయొద్దు, అంతా పొగరు: మోడీపై టీజీ సంచలనం, తెగదెంపులు ఎప్పుడంటేబాబును తక్కువ అంచనా వేయొద్దు, అంతా పొగరు: మోడీపై టీజీ సంచలనం, తెగదెంపులు ఎప్పుడంటే

 బీజేపీతో రాంరాంకు హింట్ ఇచ్చారా

బీజేపీతో రాంరాంకు హింట్ ఇచ్చారా

బీజేపీతో చంద్రబాబు తాడోపేడో తేల్చుకుంటారని టీడీపీ నేతల తీరును బట్టి అర్థమవుతోంది. కొందరు ఆచితూచి మాట్లాడుతున్నప్పటికీ బీజేపీతో కటీఫ్‌కు హింట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన బీజేపీపై దుమ్మెత్తి పోశారు.

 బీజేపీకి హెచ్చరికలు

బీజేపీకి హెచ్చరికలు

అదే సమయంలో, టీజీ వెంకటేష్ మరో ఆసక్తికర కామెంట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వం వహిస్తే దేశంలో చాలా పార్టీలు ఏకమవుతాయని వ్యాఖ్యానించారు. గతంలో జాతీయస్థాయిలో ప్రభుత్వాలపై ప్రభావం చూపిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అలాంటి చంద్రబాబును తక్కువగా అంచనా వేయవద్దని బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు.

చంద్రబాబు మళ్లీ ఢిల్లీస్థాయిలో చక్రం తిప్పుతారా

చంద్రబాబు మళ్లీ ఢిల్లీస్థాయిలో చక్రం తిప్పుతారా

కేంద్రంలో ఎన్డీయే, యూపీఏలు ప్రధానంగా ఉన్నాయి. జాతీయస్థాయిలో థర్డ్ ఫ్రంట్‌కు లెఫ్ట్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఏపీలో బీజేపీని దూరం పెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లెఫ్ట్ పార్టీలతో టీడీపీ కలిసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో కలవడానికి కొందరు లెఫ్ట్ నేతలు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీకి కేంద్రం నుంచి అన్యాయం జరుగుతోందని భావిస్తే చంద్రబాబు బీజేపీని వదిలేసి, జాతీయస్థాయిలో థర్డ్ ఫ్రంట్‌కు చక్రం తిప్పినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది

మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది

టీజీ వెంకటేష్‌తో పాటు కొందరు టీడీపీ నేతలు మరో మాట కూడా చెబుతున్నారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే మిగిలేది చిప్పేనని, కేంద్రంతో అంచెలవారీగా చంద్రబాబు పోరాటం చేస్తారని చెప్పారు. అయితే బీజేపీతో అంచెలవారీగా పోరాటం చేసేందుకు చంద్రబాబుకు సమయం లేదని అంటున్నారు. మరో ఏడాది ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మరికొద్ది రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు. బీజేపీతో ఉంటారా ఉండరా అనే విషయం ఆదివారం నాటి కీలక భేటీలో లేదా మరో ఒకటి రెండు నెలల్లో తేలిపోనుందని అంటున్నారు.

 బీజేపీకి హెచ్చరికలతో సాధించే ప్రయత్నమా

బీజేపీకి హెచ్చరికలతో సాధించే ప్రయత్నమా

బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వం వహిస్తే అన్ని పార్టీలు ఏకమవుతాయని టీడీపీ నేతలు అంటున్నారు. అదే జరిగితే ఢిల్లీకి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. హెచ్చరికలతో బీజేపీ నుంచి పనులు చేయించుకోవాలని టీడీపీ ప్రస్తుతం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 తెరపైకి మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్

తెరపైకి మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్

టీడీపీ.. బీజేపీని ప్రత్యేక హోదా అంశంతోను చిక్కుల్లోకి నెట్టాలని చూస్తోంది. టీడీపీ మళ్లీ హోదాను లేవనెత్తుతోంది. హోదా ఇవ్వలేమంటే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని, ఇదీ కూడా ఇవ్వనప్పుడు తాము తిరిగి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తామని ఊహించని షాకిస్తున్నారు. మోడీ మాటను నిలబెట్టుకోకుంటే సెల్యూట్ చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ తీరును చూస్తుంటే పొత్తు ఫైనల్ స్టేజ్‌లో కనిపిస్తోందని అంటున్నారు.

English summary
The BJP's biggest ally in the south, the Telugu Desam Party of Chandrababu Naidu, is upset over the Budget and has called an "emergency meeting" with party leaders on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X