బాబు రూ.100 లక్షల కోట్ల టార్గెట్: ఆ రాక్షసుడిని అడ్డుకోకుంటే.., 'సాక్షి'కి చెక్!
విశాఖ: విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి రూ.10.54 లక్షల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అమలులోకి వస్తే 22.5 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
2029 నాటికి రూ.వంద లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే తమ లక్ష్యమన్నారు. దాంతో 1.5 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయని, తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. అమరావతిలో దావోస్ తరహాలో భారీ సదస్సు నిర్వహిస్తామన్నారు.
విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు శనివారం సాయంత్రం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఒక పెట్టుబడిదారుల సదస్సులో రూ.10.54లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు రావడం ఎక్కడా జరగలేదన్నారు.
సదస్సు అంటే ఏదో పదిమంది వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోవడం కాదని, ఎనిమిది ప్లీనరీ సదస్సులు నిర్వహించామని, 50 దేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు వచ్చారని, ఎనిమిది మంది కేంద్రమంత్రులు హాజరయ్యారన్నారు.

దావోస్ తరహా వేదిక
పెట్టుబడులతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు సహా అనేక అంశాలపై చర్చించామని చంద్రబాబు భవిష్యత్తులో అమరావతిలో ఏటా దావోస్ తరహా పారిశ్రామిక, విద్య, మీడియా, కార్పోరేట్, ప్రభుత్వ, సామాజిక తదితర రంగాల వారిని ఒకవేదిక పైకి తెస్తామన్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాదినే ప్రారంభిస్తామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి భాగస్వామ్య సదస్సుని కేంద్రం, డీఐపీపీ, సీఐఐలతో కలిసి నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు.

ఆ రాక్షసులను అడ్డుకోకుంటే లేకుంటే మన పరువు పోయేది
పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు రోజున విశాఖలో ఆందోళన చేయాలని విపక్ష నాయకుల పైన చంద్రబాబు ఆగ్రహించారు. వాళ్లు రాక్షసులని, దుర్మార్గులని అన్నారు. రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని భంగం చేయాలనుకుంటే పోలీసులు సమర్థంగా అడ్డుకున్నారని చెప్పారు. లేకపోతే అపహాస్యం పాలయ్యేవారిమని, ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోయేదన్నారు.

జగన్ ఘోరంగా తిట్టారు
జగన్ పోలీసులను అనరాని మాటలు అన్నారని, నేను సీఎంని, నన్నే అడ్డుకుంటారా అని బెదిరించారని, పోలీసులు ఓపికగా భరించారని, కరడుగట్టిన నేరస్తుల తిట్లు భరించాల్సి వస్తోందన్నారు. ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించబోనన్నారు.

అవాస్తవాలు
హోదా లేకుంటే పరిశ్రమలు రావని చెబుతున్నవాళ్లు... హోదా ఉన్న రాష్ట్రాల్లో గత పదిపదిహేనేళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో, మన రాష్ట్రంలో ఎన్ని వచ్చాయో చెప్పాలని పవన్-జగన్‌లని నిలదీశారు. ప్రత్యేక హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామని చెప్పినప్పుడు ఇక ఆందోళన ఎందుకన్నారు. భవిష్యత్తులో దేశ పారిశ్రామిక రంగంలో ఏపీకి చెందినవారే నాయకత్వం వహిస్తారని, వారిని అలా తీర్చిదిద్దుతానన్నారు.

విహారయత్రలా..
పెట్టుబడులు ఆకర్షించేందుకు తాను దావోస్ వెళితే విహారయాత్రలకు వెళ్లారని విపక్షాలు విమర్శించడంపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. దావోస్‌లో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, అక్కడికి ఏ విహారయాత్రలకు వెళ్తమని, రెండు రోజులుగా చూస్తున్నారని, ఇక్కడ నిమిషమైనా ఖాళీగా ఉన్నామా? నేపాల్ నుంచి మంత్రి వస్తే రెండుసార్లు ఆయనతో సమావేశం ఏర్పాటు చేసి, వాయిదా పడిందన్నారు. ఆయన బాధపడుతుంటే తమ వాళ్లను పంపి క్షమాపణ చెప్పి, ఈ రోజు మళ్లీ సమావేశమయ్యానని, తన పాలనా విధానాలన్నా, ఎన్టీఆర్ అన్నా తనకు ఎంతో అభిమానమని, తనను కలిసే అవకాశం రాదేమోనని బాధపడ్డానని ఆయన తనతో అన్నారని చెప్పారు.

యువత ఆలోచించాలి
యువత సంయమనంతో వ్యవహరించాలని, తమకు ఏది మంచో నిర్ణయించుకోవాలని, ఎవరో రెచ్చగొట్టారని ఆందోళనలకు దిగి జీవితాలను నాశనం చేసుకోవడం మంచిది కాదని చంద్రబాబు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాల్ని నమ్మవద్దని, ఆ మాయలో పడవద్దని సూచించారు.

మంచి పత్రికలనే ఆదరించండి
పత్రికల్లో కూడా పనిగట్టుకుని విష ప్రచారం చేసేవాటిని ప్రజలు దూరంగా ఉంచాలన్నారు. మంచి పత్రికలనే ఆదరించాలని చంద్రబాబు అన్నారు. ఏ పత్రికల్లో ఏ వార్తల్ని, ఏ ఉద్దేశంతో రాస్తున్నారో రాబోయే రోజుల్లో తానే విశ్లేషించి ప్రజల ముందు ఉంచుతానని చంద్రబాబు చెప్పారు. తద్వారా చంద్రబాబు సాక్షి పత్రికను టార్గెట్ చేశారు.

ఏపీలో పెట్టుబడులు
పరిశ్రమల రంగంలో రూ.2.1 లక్షల కోట్ల పెట్టుబడితో 91 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. దీంతో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశముంది. ఇంధన రంగంలో రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులతో 47 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. వీటితో 86 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాసముంది.

పెట్టుబడులు
ఎపీసీఆర్డీఏతో రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడికి 62 ఎంవోయూలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలున్నాయి. మైనింగ్ రంగంలో రూ.11,113 కోట్ల పెట్టుబడులతో 50 ఎంవోయూలు కుదిరాయి. వాటి ద్వారా సుమారు 17 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.

ఇన్వెస్టుమెంట్లు
ఆహారశుద్ధి రంగంలో రూ.6,055 కోట్ల పెట్టుబడులతో 177 ఎంవోయూలు కుదిరాయి. వాటితో 60 వేలమందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. పర్యాటక రంగంలో రూ.7,237 కోట్ల పెట్టుబడితో 69 ఎంవోయూలు కుదిరాయి. వాటితో 50వేల మందికి ఉపాధి అవకాశాలుంటాయి. ఐటీ రంగంలో రూ. 4,813 కోట్ల రూపాయల పెట్టుబడులతో 67 ఎంవోయూలు కుదిరాయి. వాటి ద్వారా సుమారు 47 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించవచ్చు.

ఎంవోయులు
రోడ్లు భవనాల శాఖలో రూ.74 వేల కోట్ల పెట్టుబడులతో ఎంవోయూలు కుదిరాయి. టౌన్ షిప్ వసతుల కల్పనకు రూ.40 వేల కోట్ల పెట్టుబడులతో 14 అవగాహన ఒప్పందాలు కుదరగా, వాటితో 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలుంటాయి. ఏపీఈడీసీ ద్వారా 3,62,662 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో 66 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. నైపుణ్యాభివృద్ధిలో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో 3 ఎంవోయూలు, జౌళిరంగంలో రూ.521 కోట్ల పెట్టుబడులతో 8 ఎంవోయూలు, ఉన్నత విద్యారంగంలో రూ.16,706 కోట్లతో 9 ఎంవోయూలు కుదిరాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications