'నోబెల్' సాధిస్తే.. 100కోట్లు..: ఏపీ శాస్త్రవేత్తలకు సీఎం బంపర్ ఆఫర్
ఏపీకి చెందిన శాస్త్రవేత్తలెవరైనా నోబెల్ అవార్డును సాధించగలిగితే.. వారికి ప్రభుత్వం తరుపున రూ.100కోట్లు అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
తిరుపతి: శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఏపీకి చెందిన శాస్త్రవేత్తలెవరైనా నోబెల్ అవార్డును సాధించగలిగితే.. వారికి ప్రభుత్వం తరుపున రూ.100కోట్లు అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరుగుతోన్న బాలల కాంగ్రెస్‌కు సీఎం హాజరైన సీఎం.. యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఒక్క ఐడియా మొత్తం వ్యవస్థనే ప్రభావితం చేయగలదని, ఆవిధంగా భవిష్యత్తులో శాస్త్ర-సాంకేతిక పురోగతి సాధించడానికి యువతనే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

సైన్స్ కు సాంకేతికతను జోడిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, నూతన ఆవిష్కరణలకు యువత నాంది పలకాలని సీఎం సూచించారు.సృజనాత్మకంగా ఆలోచించడం అలవరుచుకోవాలని, ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదని అభిప్రాయపడ్డారు.
కాగా, మంగళవారం నాడు 104వ సైన్స్ కాంగ్రెస్ లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు.. మోడీ తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయంటూ సీఎం ప్రధాని మోడీని అభినందించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications