వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యతిరేకత: జైరాం వ్యూహం ఫలించేనా? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన కాంగ్రెసు పార్టీని గట్టెక్కించడానికి కేంద్ర మంత్రి జైరాం రమేష్ నడుం బిగించినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజన ఖాయం కావడంతో సీమాంధ్రులు అభివృద్ధిపై, తన భవిష్యత్తుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో విభజన వల్ల సీమాంధ్రకు అన్యాయం జరగలేదని, సీమాంధ్రను అభివృద్ధి చేస్తామని చెబుతూ ప్రజల విశ్వాసాన్ని పొందడానికి జైరాం రమేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తన ప్రయత్నంలో భాగంగా ఆయన సీమాంధ్రలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అడుగడుగునా తనకు వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ దాన్ని అధిగమించి కాంగ్రెసుకు అనుకూలంగా ప్రజలను మలుచుకోవాలనే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా తిరుపతిలో అడుగుపెట్టిన ఆయన వ్యతిరేకత ఎదురైంది.

ఆయన విజయవాడ, విశాఖపట్నాలను సందర్శించి, మంగళవారంనాడు గుంటూరుకు చేరుకున్నారు. సీమాంధ్రకు కేంద్ర ప్రభుత్వం విభజన సందర్బంగా చేసిన ఏర్పాట్లను ఆయన ప్రస్తావిస్తున్నారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించామని, పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని, మూడేళ్లలో కొత్త రాజధాని ఏర్పాటవుతుందని ఆయన చెబుతూ వస్తున్నారు. ఆయన వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందనేది ఇప్పుడు చెప్పడం తేలిక కాదు. భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

విశాఖలో జైరాం రమేష్..

విశాఖలో జైరాం రమేష్..

జైరాం రమేష్‌ను విశాఖపట్నంలో పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి తదితరులు కలిశారు.

భారీ భద్రతా ఏర్పాట్లు..

భారీ భద్రతా ఏర్పాట్లు..

జైరాం రమేష్ రాక సందర్భంగా విశాఖపట్నంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీమాంధ్రలో కాంగ్రెసుపై వ్యతిరేకత ఎదురవుతున్న స్థితిలో తనిఖీలు కూడా ముమ్మరంగానే సాగాయి.

జైరాం రమేష్‌కు వ్యతిరేకత

జైరాం రమేష్‌కు వ్యతిరేకత

జైరాం రమేష్ పర్యటనను వ్యతిరేకించడానికి, ఆయనకు అడ్డుపడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు.

ఆందోళనకారులు పోలీసుల అదుపులో...

ఆందోళనకారులు పోలీసుల అదుపులో...

జైరాం రమేష్ పర్యటనకు విశాఖపట్నంలో వ్యతిరేకత ఎదురైంది. ఈ సందర్బంగా పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

అడ్డుకున్న పోలీసులు..

అడ్డుకున్న పోలీసులు..

జైరాం రమేష్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు ఇలా..

సమర్థించుకున్న జైరాం రమేష్

సమర్థించుకున్న జైరాం రమేష్

సీమాంధ్రలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు అనేక సదుపాయాలను కల్పించిందని జైరాం రమేష్ చెప్పారు.

కార్యకర్తల సమావేశం..

కార్యకర్తల సమావేశం..

జైరాం రమేష్ సీమాంధ్రలోని వివిధ నగరాల్లో పర్యటిస్తూ స్థానిక నాయకులను కూడా కలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో కూడా ఆయన కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కార్యకర్తలూ ఆగ్రహం..

కార్యకర్తలూ ఆగ్రహం..

విశాఖపట్నంలో జైరాం రమేష్‌ను పలువురు నాయకులు కలిశారు. రాష్ట్ర విభజనపై పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

మీడియా సమావేశం..

మీడియా సమావేశం..

విశాఖపట్నంలో జైరాం రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీమాంధ్రకు చేసిన మేళ్లను గురించి వివరించారు.

పార్టీ కార్యకర్తలు కలిశారు..

పార్టీ కార్యకర్తలు కలిశారు..

జైరాం రమేష్, పార్టీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడు కె. రాజు హోటల్‌కు వెళ్లిన తర్వాత వారిని పార్టీ నాయకులు పలువురు కలిశారు. పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు.

English summary
Union minister Jairam Ramesh is trying gain confidence of Seemandhra people visiting various cities like Tirupati, Vijayawada, Visakhapatnam and Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X