జగన్‌కు సవాల్: చిరంజీవితో పవన్ కళ్యాణ్ కలుస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పైన ఉద్యమించేందుకు వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు సన్నద్దమయ్యాయి. మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తాను త్వరలో తన మౌనాన్ని వీడుతానని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
అన్ని రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు పరిధి విధిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురువారం నుండి మూడ్రోజుల పాటు చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టింది.

మరోవైపు, బాబు హామీలు నిలబెట్టుకోలేకపోయినప్పటికీ విపక్ష నేతగా జగన్ విఫలమయ్యారని, తాము వస్తున్నామని కాంగ్రెసు పార్టీ నేతలు బుధవారం చెప్పారు. కాంగ్రెసు పార్టీ నిరసన కార్యక్రమాల్లో చిరంజీవి కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ త్వరలో పెదవి విప్పుతానని చెప్పారు.
టీడీపీ, బీజేపీల తరఫున ప్రచారం చేసిన పవన్ ఇప్పుడు ఏం మాట్లాడుతారనే చర్చ సాగుతోంది. ప్రభుత్వాల చర్యలు ప్రజారంజకంగా ఉన్నాయని చెబుతారా లేక విమర్శలు గుప్పిస్తారా చూడాల్సి ఉంది. 150వ సినిమా బిజీలో ఉన్న చిరంజీవి కూడా కాంగ్రెసు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చిరుకు పవన్ తోడవుతారా లేక విభేధిస్తారా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications