ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలొచ్చాయ్: ఇదే రైట్ టైమ్.. నిత్యావసరాల ధరల సెగ

ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రోజు ఉన్న రేట్లు రేపు ఉండట్లేదు. మరింత పెరిగిపోతూనే ఉన్నాయి. ఏమాత్రం అదుపు లేకుండా పెరుగుతున్న ధరలకు పేద, మధ్యతరగతి ప్రజలు బలి అవుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్నారు. వారాల వ్యవధిలోనే దాదాపుగా అన్ని రకాల కిరాణా సరుకుల ధరలు కూడా గరిష్టంగా 30 శాతానికి పెరగడం సామాన్యులను ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు.

ఎంత లేదన్నా నెలకు రూ. 2,000 అదనపు భారం

ప్రతి కుటుంబంపై కూడా ఎంత లేదన్నా నెలకు కనీసం 2,000 నుంచి రూ.3,000 వరకు అదనపు భారం పడుతోంది. దైనందిన జీవితంలో నిత్యం వాడే బియ్యం, పప్పులు, వంటనూనెలతో పాటు కూరగాయలు కూడా తగ్గేదే లేదంటోన్నాయి. ఈ ధరాఘాతం వల్ల ఓ సగటు వ్యక్తి ఇల్లు గడవడం దినదిన గండంగా మారింది. దీనికి ఎక్కడ బ్రేక్ పడుతుందనేది కూడా తెలియని పరిస్థితుల్లో పడ్డారు సామాన్య ప్రజలు. ఇప్పటికే 110 రూపాయలు దాటిన పెట్రోల్ వల్ల బండ్లు గుదిబండగా మారాయి. ఇక వంటగ్యాస్ సిలిండర్ ధరలు.. సరేసరి.

Will Soaring Essential Commodity Prices Swing and Impact on Local Body Election Results in Andhra

ముప్పేట దాడి..

అటు పెట్రోల్, ఇటు సిలిండర్.. మరోవంక నిత్యావసర సరుకులు ధరలు, ఇంకో వైపు నుంచి కూరగాయల రేట్లు సామాన్యుడిపై మోయలేని భారంగా తయారయ్యాయి. ముప్పేటదాడి చేస్తోన్నాయి. అయినప్పటికీ.. ఎలాగోలా నెట్టుకుని వద్దామనుకుంటోన్న వారిపై బియ్యం, పప్పులు, వంటనూనెల పడింది. ధరల చట్రంలో ఇరుక్కుని దిక్కుతోచని స్థితికి చేరుకుంటోన్నారు. ఏపీలో మూడు నెలల కిందటి వరకు ఫర్వాలేదనుకునే స్థాయిలో ఉన్న నిత్యావసర సరుకుల రేట్లన్నీ కూడా అమాంతం పైకి ఎగిశాయి.

మావాడు సేఫ్ గా ఇంటికి రాకపోతే..: పెద్దిరెడ్డి స్ట్రిక్ట్ వార్నింగ్
మావాడు సేఫ్ గా ఇంటికి రాకపోతే..: పెద్దిరెడ్డి స్ట్రిక్ట్ వార్నింగ్

రూ. 100 మార్కును తాకినా

ఇదివరకు కిలో రూ. 45కి లభించిన సోనా మసూరీ బియ్యం ఇప్పుడు రూ.75 కి దాటింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం రకాలు కిలో రూ. 80 నుంచి రూ. 85 వరకు విక్రయిస్తోన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సన్నరకం సోనామసూరి బియ్యం బ్యాగ్ 2,200 రూపాయలను తాకింది. నిత్యావసరాల ధరల పెరుగుదల ధోరణి ఇలాగే అడ్డూ అదుపు లేకుండా కొనసాగితే.. రాబోయే రోజుల్లో కిలో బియ్యం ధర రూ. 100 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. ఇది ఒక్క బియ్యంతో ఆగట్లేదు.

ఈ 27 స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థులు వీళ్లే.. !!
ఈ 27 స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థులు వీళ్లే.. !!

చేదెక్కిన చక్కెర

రూ. 118 నుంచి రూ. 120 వరకు ఉన్న కిలో కందిపప్పు ఇప్పుడు రూ.140 నుంచి రూ. 145 పలుకుతోంది. సన్‌ఫ్లవర్ నూనె రూ. 151 నుంచి రూ. 176 వరకు పెరిగింది. పామాయిల్ రూ. 125 నుంచి రూ. 140 ఎగబాకింది. ఎండు మిరపకాయలు కిలో రూ. 320 పైమాటే. చక్కెర రేటు దీనికేమీ తీసిపోవట్లేదు. కిలో ధర రూ. 75 వరకు ఉంటోంది. ఇప్పటికే ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు ఈ రకంగా నిత్యావసర సరుకుల ధరలు పెరగడం జీర్ణించుకోలేని అంశంగా మారింది.

ఇదే రైట్ టైమ్..

ఈ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఇప్పటికే ధరల దెబ్బకు అలసిపోయిన సామాన్యుడికి.. ఈ ఎన్నికలు ఓ అస్త్రంలా మారినట్టే. ఓటు అనే ఆయుధంతో దీన్ని తిప్పికొట్టడానికి ఓ మంచి అవకాశం లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం వల్లే ధరల రోజురోజుకూ ఆకాశానికి ఎగబాకుతున్నాయని వైఎస్ఆర్సీపీ చెబుతోంది.

ఏపీ రాజకీయాల్లో నిత్యావసర ధరల పెరుగుదల పలుమార్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన సందర్భాలు కూడా చాలానే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఉల్లిపాయలు, వంటనూనెల ధరలు అదుపు తప్పినప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు తీవ్ర ప్రజా నిరసనను ఎదుర్కొన్నాయి. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొన్నట్టే కనిపిస్తోంది. ఏపీలో ధరల బారిన పడ్డ సామాన్యుడు.. తన నిరసనను తెలియజేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ఓ చక్కటి అవకాశం దక్కిందని ఆశిస్తోన్నాడనేది సుస్పష్టం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+