ఇరాన్ ఉద్రిక్తతల వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రకటన!
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించేందుకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం యూఏఈ చేరుకున్న మంత్రి.. పర్యటన ముగింపు రోజైన శుక్రవారం రస్ అల్ ఖైమాహ్ పాలకుడు, యూఏఈ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమీతో భేటీ అయ్యారు. భారత్-యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేయడం, గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ భేటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. యూఏఈలోని ఏడు ఎమిరేట్లలో రస్ అల్ ఖైమాహ్ ఒకటి. ఇది దేశానికి ఉత్తర సరిహద్దులో ఒమన్ సరిహద్దును ఆనుకుని ఉండటంతో పాటు ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ సలసంధికి అత్యంత సమీపంలో ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, ఇరాన్ యుద్ధ ప్రభావం కారణంగా చమురు రవాణాకు భంగం వాటిల్లుతున్న తరుణంలో ఈ ప్రాంతపు పాలకుడితో జైశంకర్ సమావేశం కావడం అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది. గల్ఫ్ ప్రాంత పరిణామాలపై ఆయన అందించిన విలువైన అభిప్రాయాలకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

తన పర్యటనలో భాగంగా జైశంకర్ గురువారం అబుదాబిలో జరిగిన 'రైసీనా డైలాగ్' సదస్సులో మాట్లాడారు. జగత్తు వేగంగా మారిపోతోందని.. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. గ్లోబలైజేషన్ వెనక్కి మళ్లించలేని ప్రక్రియ అని, భారత్ తన సొంత సామర్థ్యాలను పెంచుకుంటూనే నమ్మకమైన భాగస్వామ్యాలను నిర్మించుకుంటోందని పేర్కొన్నారు. ప్రతి దేశం తన పరిస్థితులకు అనుగుణంగా కొత్త భాగస్వాములను, ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం నైజమని, సాంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా వ్యూహాత్మక అవగాహనతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
గత దశాబ్ధ కాలంగా భారత్-యూఏఈల మధ్య పెంపొందిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, మారుతున్న ప్రపంచ వాతావరణానికి అనుగుణంగా రెండు దేశాలు ఎలా రూపాంతరం చెందాయో చెప్పడానికి ఓ అద్భుతమైన నిదర్శనమని జైశంకర్ పేర్కొన్నారు. బుధవారం రోజున ఆయన యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జరిగిన భేటీలో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఇరాన్ వైపున సాయుధం పోరాటం, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతల వేళ భారత విదేశాంగ మంత్రి పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత పటిష్టం చేసింది.
An honour to meet HH Sheikh Saud bin Saqr Al Qasimi, the Ruler of Ras Al Khaimah & member of the UAE Supreme Council. Grateful for his insights on further strengthening 🇮🇳🇦🇪 ties, and deepening engagements with the region. The situation in the Gulf also came up for discussion. https://t.co/N0hL5R3Pd2
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 16, 2026












Click it and Unblock the Notifications
