'ఆయన కోసం 9 హత్యలు చేయించా'.. క్లారిటీ ఇస్తూ మాట మార్చిన ఎమ్మెల్యే !
బీహార్ రాజకీయంలో ఓ వివాదాస్పద కామెంట్ తీవ్ర సంచలనం సృష్టించింది. జేడీయూ మోకమా ఎమ్మెల్యే అనంత సింగ్, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోసం గతంలో తానే తొమ్మిది మందిని హత్య చేయించానని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పట్నా గ్రాడ్యుయేట్ స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేళ జేడీయూ పార్టీలోనే అంతర్గత విభేదాలు భగ్గుమన్న తరుణంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అయితే సొంత కామెంట్సే ముప్పు తెచ్చిపెట్టేలా ఉండటంతో ఆయన వెంటనే ఓ వీడియో విడుదల చేసి వివరణ ఇస్తూ మాట మార్చారు.
తన మొదటి ప్రకటనలో అనంత్ సింగ్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఆ రోజుల్లో నితీష్ కుమార్కు పెద్దగా గుర్తింపు లేదని.. ఆయన అటూ ఇటూ తిరుగుతుండేవారని అన్నారు. ఆ సమయంలో నితీష్ కుమార్ వెంటనే ఉన్న తాను ఆయన కోసం 9 మందిని హత్య చేయించానని అన్నారు. ఈ ప్రకటన బయటకు రాగానే బీహార్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో ఆయన వెంటనే స్పందిస్తూ.. తాను చెప్పిన మాటల అర్థం అది కాదని, లాలు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో నితీష్ కుమార్కు మద్దతుగా నిలిచినందుకు తన 9 మంది సహచరులు దారుణంగా హత్యకు గురయ్యారని కొత్త రాగం అందుకున్నారు.

జేడీయూ నేత నీరజ్ కుమార్కు కౌంటర్ ఇచ్చే క్రమంలో తాను చేసిన త్యాగాలను మాత్రమే గుర్తుచేశానని అనంత సింగ్ వివరణ ఇచ్చారు. ఆ రోజుల్లో నితీష్ కుమార్కు అండగా నిలబడటం వల్లే తన 9 మంది అనుచరులు ప్రాణాలు కోల్పోయారని, చివరికి తనపై కూడా గుళ్ల వర్షం కురిపించారని సవరించారు. తొలి ప్రకటనలో నితీష్ కోసం 9 మందిని చంపించానని చెప్పిన ఆయన.. రెండో ప్రకటనలో నితీష్ కోసం 9 మంది తమ అనుచరులు బలైపోయారని చెప్పడం గమనార్హం.
ఈ వివాదం వెనుక పట్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం దాగి ఉంది. జేడీయూ పార్టీ ఈ స్థానం నుంచి నీరజ్ కుమార్ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అనంత్ సింగ్.. జన్ సురాజ్ అభ్యర్థి అనుజ్ సింగ్కు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడమే కాకుండా వరుసగా చేస్తున్న కామెంట్లతో జేడీయూ నాయకత్వానికి తలనొప్పిగా మారారు. ఈ వివాదంపై జేడీయూ అగ్రనాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
#WATCH | Patna, Bihar: JD(U) MLA Anant Singh says, "... I have responded to Neeraj Kumar, detailing the sacrifices I have made. During the Lalu Yadav government, nine of my associates were killed, and I myself was shot. It was because we aligned ourselves with Nitish Kumar that Lalu Yadav had them killed. We have suffered such immense losses. My father also passed away due to a heart attack..."
— ANI (@ANI) October 16, 2026














Click it and Unblock the Notifications
