ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్‌ రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు జాప్యాన్ని ఎలా తగ్గించుకోవాలి

మీ ఇన్‌స్టంట్ పర్సనల్‌ లోన్‌ దరఖాస్తు సులభతరం చేయడానికి, మీ పత్రాలు సిద్ధం చేసుకోండి, మీ అర్హత పరిశీలించుకోండి, మీ తిరిగి చెల్లింపులు ప్లాన్ చేసుకోండి.ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్‌ అనేది మీరు ముందుగా అనుకున్న లేదా అనుకోని ఖర్చులను తీర్చడంలో సాయపడుతుంది. అయితే, పత్రాలు లేకపోవడం, వివరాలు సరిపోలకపోవడం లేదా తగిన రీతిలో లేని క్రెడిట్ రిపోర్ట్ వంటివి దరఖాస్తు ప్రక్రియను ఆలస్యం చేయవచ్చు.

ముందుగానే సిద్ధమైతే ఆలస్యాన్ని నివారించుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసే ముందు అర్హత ప్రమాణాలు పరిశీలించండి. మీ క్రెడిట్ రిపోర్ట్‌ సమీక్షించండి, మీ KYC, ఆదాయ పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. మీ బ్యాంక్ వివరాలు సరిచూసుకోండి. మీరు ఆఫర్‌ అంగీకరించే ముందు వర్తించే ఫీజులు అర్థం చేసుకుంటే మీ EMIని అంచనా వేసుకోగలుగుతారు.దరఖాస్తు ఎలా సిద్ధం చేసుకోవాలి, ఆన్‌లైన్ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలి, రుణం పంపిణీ అయిన తర్వాత తిరిగి చెల్లింపులు ఎలా జరపాలన్నది ఇందులో మీరు తెలుసుకోవచ్చు.

ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఆమోదించటానికి ముందు ఏమి పరిశీలిస్తారు?

ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్‌ దరఖాస్తులో అర్హత పరిశీలనలు, ధ్రువీకరణ ఉంటాయి. ప్రక్రియ ప్రారంభించే ముందు సరైన సమాచారాన్ని సిద్ధం చేసుకొని వీటిని అర్థం చేసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

• అర్హత: వయస్సు, జాతీయత, ఉద్యోగ వివరాలు, ఆదాయం వర్తించే ప్రమాణాలకు అనుగుణంగా అంచనా వేయబడతాయి. దరఖాస్తు చేసే ముందు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్‌ లోన్‌ అర్హత అవసరాలు పరిశీలించండి.

• క్రెడిట్‌ ప్రొఫైల్: గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డులు, తిరిగి చెల్లింపుల చరిత్ర గురించి క్రెడిట్ రిపోర్ట్ సమాచారం అందిస్తుంది. దీనిని ముందుగానే పరిశీలించుకోవడం వలన, అందించిన సమాచారం కచ్చితమైనదో కాదో దరఖాస్తుదారులు సరిచూసుకోవడానికి వీలు కలుగుతుంది.

• గుర్తింపు ధ్రువీకరణ: ప్యాన్, ఆమోదించిన గుర్తింపు, చిరునామా పత్రాలు, నో యువర్ కస్టమర్ (KYC) ప్రక్రియ గుర్తింపును నిర్ధారించడానికి సాయపడతాయి.

• ఆదాయ ధ్రువీకరణ: శాలరీ స్లిప్స్‌, బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌ లేదా ఇతర వర్తించే ఆదాయ పత్రాలు ఆదాయాన్ని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని నిర్ధారించడానికి సాయపడతాయి.

• బ్యాంకు ఖాతా వివరాలు: అకౌంట్ నెంబర్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (IFSC) పంపిణీ, తిరిగి చెల్లింపుల కోసం సరైన బ్యాంక్ ఖాతా గుర్తించేందుకు సాయపడతాయి.

ఈ వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం వలన దరఖాస్తుదారులు సంబంధిత పరిశీలనలను మరింత సమర్థవంతంగా పూర్తి చేయడానికి వీలు కలుగుతుంది. దరఖాస్తు, కస్టమర్ ప్రొఫైల్‌ను బట్టి బజాజ్ ఫైనాన్స్ అదనపు సమాచారం లేదా పత్రాలు కోరవచ్చు.

Instant Personal Loan How to Avoid Delays During the Application Process

బజాజ్‌ ఫైనాన్స్ పర్సనల్‌ లోన్ కోసం ఎవరు అప్లై చేసుకోవచ్చు?

వర్తించే అర్హత ప్రమాణాలు కలిగిన దరఖాస్తుదారులు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ అవసరాలు ముందుగానే సరిచూసుకోవడం వలన, దరఖాస్తుదారులు తాము ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో లేదో అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది.

జాతీయత భారతీయుడు
వయస్సు 21 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు
కస్టమర్‌ ప్రొఫైల్‌ స్వయం ఉపాధి లేదా వేతనం పొందేవారు
యజమాని (జీతం పొందే దరఖాస్తుదారుల కోసం) ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఎంఎన్‌సీ
సిబిస్‌ స్కోర్ 650 లేదా అంత కంటే ఎక్కువ

*రుణ కాలపరిమితి ముగిసే సమయానికి మీ వయస్సు 80 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.

ఆదాయానికి సంబంధించిన నిబంధనలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తుదారు వివరాలు, వర్తించే ప్రమాణాల ఆధారంగా మారవచ్చు. తుది ఆమోదం అనేది అవసరమైన పరిశీలన, ధ్రువీకరణపై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్‌ చిట్కా: మీ ప్రొఫైల్, ధ్రువీకరణ అవసరాలను బట్టి కావాల్సిన పత్రాలు మారవచ్చు.

సాధారణ పత్రాల్లో ఇవి ఉంటాయి

• కేవైసీ పత్రాలు: ఆధార్/ పాస్‌పోర్ట్/ ఓటరు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ/ ఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్
• పాన్ కార్డ్
• ఉద్యోగి గుర్తింపు కార్డు
• గత 3 నెలల జీతం స్లిప్‌లు
• గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌లు
• పైప్డ్ గ్యాస్ బిల్లు
• పెన్షన్ ఆర్డర్
• యజమాని జారీ చేసిన వసతి కేటాయింపు లేఖ
• ఆస్తి / మున్సిపల్ పన్ను రసీదు
• యుటిలిటీ బిల్లు
• ఫోన్ బిల్లు
• రియల్-టైమ్ ఇమేజ్/ఫొటోగ్రాఫ్

దరఖాస్తును బట్టి బజాజ్ ఫైనాన్స్ అదనపు పత్రాలు కోరవచ్చు.

ప్రక్రియ సులభతరం చేయడానికి మీరు మీ దరఖాస్తును ఎలా సిద్ధం చేసుకోవాలి?

దరఖాస్తు చేసే ముందు కొన్ని సాధారణ పరిశీలన చేసుకోవడం వలన సవరణలు తగ్గించి, అవసరమైన సమాచారాన్ని అందించడం సులభతరమవుతుంది. సిద్ధం కావడానికి ఈ దిగువ చెక్‌లిస్ట్‌ పరిశీలించండి.

ఏం చెక్ చేయాలి ఎలా సిద్ధం చేయాలి
వ్యక్తిగత వివరాలు సమర్పించే పత్రాల్లో ఉండే విధంగా మీ పేరు, పుట్టిన తేదీ నమోదు చేయండి.
పత్రాలు అవసరమైన పత్రాలు సహా, అడిగిన అన్ని పత్రాల స్పష్టమైన, చదవగలిగే కాపీలు సిద్ధంగా ఉంచుకోండి.
ప్యాన్, ఆధార్‌ ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లింకింగ్ స్టేటస్‌ చెక్‌ చేసి, అవసరమైతే ఆ ప్రక్రియ పూర్తి చేయండి.
బ్యాంకు ఖాతా వివరాలు క్యాన్సిల్‌ చేసిన చెక్కు, బ్యాంకు అధికారిక యాప్‌ ఉపయోగించి బ్యాంక్ అకౌంట్‌ నెంబర్‌, IFSC ధ్రువీకరించుకోండి.
ఆదాయ సమాచారం అవసరమైన పే స్లిప్స్‌, బ్యాంకు స్టేట్‌మెంట్స్‌, లేదా ఇతర వర్తించే ఆదాయ పత్రాలు దగ్గర ఉంచుకోండి.
క్రెడిట్ రిపోర్టు దరఖాస్తు చేసే ముందు కచ్చితమైన అకౌంట్ సమాచారం, తిరిగి చెల్లింపుల రికార్డుల కోసం నివేదిక పరిశీలించండి.
ప్రస్తుత EMIలు తగిన రుణ మొత్తం, కాలపరిమితిని ఎంచుకోవడంలో సాయపడటానికి ప్రస్తుత నెలవారీ తిరిగి చెల్లింపులు లెక్కించండి.

ఒక ఖాతా ఇటీవల మూసివేయబడినట్లయితే, క్రెడిట్ నివేదికలో దాని స్టేటస్‌ అప్‌డేట్‌ అయిందో లేదో చెక్‌ చేయండి. కరెక్షన్ అవసరమైతే ఆ సమాచారాన్ని అందించిన సంస్థ లేదా సంబంధిత క్రెడిట్ బ్యూరోను సంప్రదించండి.

దరఖాస్తుదారులకు వారి సమాచారాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి, ధ్రువీకరణకు సిద్ధం కావడానికి ఇవి సాయపడతాయి. క్రెడిట్ నివేదికలో కొన్ని అప్‌డేట్స్‌ కనిపించడానికి సమయం పట్టవచ్చు, కాబట్టి ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.

మీరు మీ పర్సనల్‌ లోన్ మొత్తం, EMIని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు?

పర్సన్‌ లోన్‌ కోసం సిద్ధమయ్యేటప్పుడు సరైన లోన్‌ మొత్తం, తిరిగి చెల్లించే కాలపరిమితి ఎంచుకోవడం ఒక ముఖ్యమైన విషయం. ఆ మొత్తం ఖర్చును భరించేలా ఉండాలి, నెలవారీ బడ్జెట్‌లో EMI సౌకర్యవంతంగా ఉండాలి.

బజాజ్ ఫైనాన్స్ రూ.40,000 నుంచి రూ.55 లక్షల వరకు పర్సనల్‌ లోన్స్ అందిస్తుంది. వీటిని 12 నెలల నుంచి 108 నెలల వరకు తిరిగి చెల్లించే కాలపరిమితితో పొందవచ్చు. వర్తించే ఆఫర్, నిబంధనలను బట్టి వడ్డీ రేట్లు సంవత్సరానికి 10% నుంచి 30.5% వరకు ఉంటాయి.

దరఖాస్తు చేసే ముందు మీరు చేయాలనుకుంటున్న ఖర్చులు రాసిపెట్టుకొని అవసరమైన మొత్తం డబ్బు అంచనా వేయండి. ఉదాహరణకు, ఇంటి రిపేర్‌ బడ్జెట్‌లో కాంట్రాక్టర్ ఛార్జీలు, సామాగ్రి, పెయింటింగ్, ఫ్లోరింగ్, ఫర్నిచర్ వంటివి చేర్చవచ్చు. అంచనా వాస్తవికంగా ఉంటే ఎంత రుణం తీసుకోవాలో నిర్ణయించుకోవడానికి దరఖాస్తుదారులకు వీలు కలుగుతుంది.

EMI వ్యవధిని రుణ మొత్తం ఎలా ప్రభావితం చేస్తుంది?

నెలవారీ EMIని రుణ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే కాలపరిమితి నిర్ణయిస్తాయి. వడ్డీ రేటు స్థిరంగా ఉన్నప్పుడు ఎక్కువ కాలపరిమితి సాధారణంగా నెలవారీ వాయిదాను తగ్గిస్తుంది, కానీ చెల్లించే మొత్తం వడ్డీని పెంచుతుంది.

ఉదాహరణకు, సంవత్సరానికి 14% వడ్డీ రేటుతో రూ.3 లక్షల రుణం.

తిరిగి చెల్లింపు వ్యవధి నెలవారీ EMI సుమారు సుమారు మొత్తం వడ్డీ
24 నెలలు రూ. 14,404 రూ. 45,693
36 నెలలు రూ. 10,253 రూ. 69,118

36 నెలల కాలపరిమితి అనేది 24 నెలల EMIతో పోలిస్తే నెలవారీ EMI సుమారుగా రూ. 4,151 తక్కువగా ఉంటుంది. అయితే, మొత్తం వడ్డీ సుమారుగా రూ. 23,426 ఎక్కువ ఉంటుంది.

అధిక నెలవారీ వాయిదాను సౌకర్యవంతంగా చెల్లించగల దరఖాస్తుదారులకు తక్కువ కాలపరిమితి అనుకూలంగా ఉండవచ్చు. ఎక్కువ కాలపరిమితి నెలవారీ బడ్జెట్‌లో మరింత వెసులుబాటు కల్పించవచ్చు, అయినప్పటికీ మొత్తం వడ్డీ ఖర్చు అధికంగా ఉంటుంది.

*ఈ మొత్తాలు కేవలం ఉదాహరణ కోసం మాత్రమే. వర్తించే ఫీజులు, ఛార్జీలు మినహాయించి ఇవ్వబడ్డాయి. అసలు EMI అనేది వడ్డీ రేటు, రుణ నిబంధనలు, తిరిగి చెల్లింపు షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది.

ఆఫర్‌ అంగీకరించే ముందు ముఖ్యమైన వాస్తవాల నివేదిక (KFS)లోని ప్రాసెసింగ్ ఫీజు, ఇతర వర్తించే ఛార్జీలు, వార్షిక శాతం రేటు (APR) సమీక్షించండి. ఇది రుణం తీసుకునే డబ్బుపై అయ్యే మొత్తం ఖర్చు అర్థం చేసుకునేలా దరఖాస్తుదారులకు సాయపడుతుంది.

ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్‌ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా?

దరఖాస్తుదారులు తమ అర్హతను పరిశీలించుకొని అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకోవడం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించవచ్చు. దరఖాస్తు దశలు జాగ్రత్తగా అనుసరించడం వలన, మదింపు కోసం సంబంధిత వివరాలు సమర్పించినట్టు నిర్ధారించుకోవచ్చు.

ఈ సులభమైన దశలు అనుసరించడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు:

1. లోన్‌ అర్హత చెక్‌ చేసుకోండి - బజాజ్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌లోని పర్సనల్‌ లోన్‌ పేజీ సందర్శించండి, మీకు అవసరమైన రుణ మొత్తాన్ని, తిరిగి చెల్లించే వ్యవధిని ఎంచుకోండి. మీ రుణ అర్హత పరిశీలించడానికి "చెక్‌ లోన్‌ ఆఫర్‌" (CHECK LOAN OFFER) పై క్లిక్ చేయండి

2. వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి -మీ కోసం ప్రత్యేకమైన లోన్‌ ఆఫర్‌ అందించడానికి మీ వ్యక్తిగత, ఆర్థిక, ఉద్యోగ వివరాలు అందించండి.

3. మీ లోన్‌ ఆఫర్‌ సమీక్షించండి -మీ ఆఫర్‌ డిటెయిల్స్ చెక్ చేయండి, అవసరమైతే రుణమొత్తం లేదా తిరిగి చెల్లింపు వ్యవధిని అడ్జస్ట్ చేయండి.

4. KYC తనిఖీ పూర్తి చేయండి - దరఖాస్తులో ముందుకు సాగేందుకు మీరు అందించిన గుర్తింపు, బ్యాంకు వివరాలు సరిచూసుకోండి.

5. లోన్ స్పెషలిస్టుతో మాట్లాడండి - మీరు దరఖాస్తు సమర్పించిన తర్వాత ఒక అధికారి తదుపరి చర్యల కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు

దరఖాస్తు పరిశీలన జరిగి అవసరమైన ధ్రువీకరణ పూర్తయిన తర్వాత, అర్హులైన దరఖాస్తుదారులకు వర్తించే నియమ నిబంధనలకు లోబడి, ఆమోదించిన మొత్తాన్ని 24 గంటలలోపు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

ముఖ్య గమనిక: దరఖాస్తు ప్రక్రియ అనేది ఆమోదానికి హామీ కాదు. ఫలితం, పంపిణీ, కాలపరిమితి, అర్హత, ధ్రువీకరణ అనేది వర్తించే నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.

మీ రుణం పంపిణీ అయిన తర్వాత మీరు ఏమి పరిశీలించాలి?

రుణ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత, తిరిగి చెల్లింపుల షెడ్యూల్‌ పరిశీలించకున్నట్టు దరఖాస్తుదారులకు వారి నెలవారీ ఆర్థిక ప్రణాళిక రూపొందించడంలో సాయపడుతుంది

• మొదటి EMI, మొత్తం: గడువు తేదీ, వాయిదా మొత్తాన్ని నిర్ధారించుకోవడానికి తిరిగి చెల్లింపుల షెడ్యూల్‌ పరిశీలించండి. తిరిగి చెల్లింపుల షెడ్యూల్‌ను బట్టి మొదటి EMI తదుపరి వాయిదాల కంటే భిన్నంగా ఉండవచ్చు.

• బ్యాంకు ఖాతా బ్యాలెన్స్: ఆటోమ్యాటిక్‌ తిరిగి చెల్లింపులు విజయవంతమైన పూర్తవడానికి వీలుగా EMI గడువు తేదీకి ముందే లింక్ చేసిన బ్యాంకు అకౌంట్‌లో తగిన బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి.

• లోన్‌ పత్రాలు: సూచన కోసం రుణ ఒప్పందం, కీలక వాస్తవాల పత్రాన్ని అందుబాటులో ఉంచుకోండి. వడ్డీ రేటు, ఫీజులు, ఛార్జీలు, తిరిగి చెల్లింపు నిబంధనలు సమీక్షించండి.

• తిరిగి చెల్లింపు గుర్తు చేసుకోవడం: తిరిగి చెల్లింపులు క్రమబద్ధంగా ఉంచడంలో సాయపడటానికి గడువు తేదీకి ముందు రిమైండర్లు సెట్ చేసుకోండి.

సకాలంలో క్రమపద్ధతిలో EMI చెల్లింపులు పటిష్టమైన తిరిగి చెల్లింపు చరిత్రకు తోడ్పడతాయి. రుణ పత్రాలు, తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ అందుబాటులో ఉంచుకోవడం వలన, రుణ కాలవ్యవధి అంతటా దానిని పర్యవేక్షించడం కూడా సులభతరం అవుతుంది.

సులభతరమైన పర్సనల్‌ లోన్ దరఖాస్తు కోసం ఈరోజే సిద్ధమవ్వండి

కచ్చితమైన వివరాలు, సరైన రీతిలో పత్రాలు, స్పష్టమైన తిరిగి చెల్లింపు ప్రణాళికతో దరఖాస్తు ప్రారంభమవుతుంది. అర్హత తనిఖీ చేయడం, క్రెడిట్ రిపోర్ట్‌ సమీక్షించడం, తగిన రుణ మొత్తాన్ని ఎంచుకోవడం వంటివి ఈ ప్రక్రియను మరింత నమ్మకంతో చేపట్టేలా దరఖాస్తుదారులకు సాయపడతాయి.

బజాజ్ ఫైనాన్స్ రూ.40,000 నుంచి రూ.55 లక్షల వరకు పర్సనల్‌ లోన్స్ అందిస్తుంది. వీటి తిరిగి చెల్లింపు కాలపరిమితి 12 నెలల నుంచి 108 నెలల వరకు ఉంటుంది, వీటికి ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు. ఆమోదం, పత్రాల ధ్రువీకరణ, వర్తించే నిబంధనలకు లోబడి, అర్హులైన దరఖాస్తుదారులు 24 గంటలలోపు* రుణ మొత్తాన్ని అందుకోవచ్చు.

మీకు అందుబాటులో ఉన్న రుణ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు కాలపరిమితి సమీక్షించడానికి మీ పర్సనల్‌ లోన్ ఆఫర్‌ చెక్‌ చేయండి.

*నియమనిబంధనలు వర్తిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+