ఈ 27 స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థులు వీళ్లే.. !!

ఏపీలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల అధికారిక జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మున్సిపాలిటీలు- 14, నగర పంచాయతీలు- 6 చోట్ల పోటీ చేసే అభ్యర్థుల పేర్లు, వారి వివరాలను ఇందులో పొందుపరిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వివిధ సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తోంది.

రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.. వైఎస్ఆర్సీపీ. స్థానికంగా ప్రజలతో మమేకమై పనిచేసే అనుభవం, ప్రజాదరణ కలిగిన నాయకులకే ఈ అవకాశాలు కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని అన్ని జిల్లాలను సమతుల్యం చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేసింది. టీడీపీ కూటమికి ధీటుగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, స్థానిక సంస్థల్లో సుపరిపాలన అందించడానికి వారు అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తోంది.

YSRCP release a list of Mayor and Chairman Candidates for 27 Municipal Corporations and Local Bodies

కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులు

రాష్ట్రంలోని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (కొప్పుల వెలమ)కి అవకాశం కల్పించింది. విజయనగరం అభ్యర్థిగా కొలగట్ల శ్రావణి (వైశ్య) పేరు ఖరారైంది. ఏలూరు మేయర్ రేసులో గంటా మోహన్ రావు (తూర్పు కాపు) నిలిచారు. నెల్లూరు కార్పొరేషన్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కడప బరిలో బండి దీప్తి రెడ్డి దిగారు. మచిలీపట్నం నుంచి లంకా జ్యోతి (తూర్పు కాపు), ఒంగోలు మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్ (వైశ్య) పోటీలో నిలిచారు.

గరుడసేవకు వర్షం పడే ఛాన్స్: టీటీడీ పక్కా ప్లాన్
గరుడసేవకు వర్షం పడే ఛాన్స్: టీటీడీ పక్కా ప్లాన్

మున్సిపాలిటీల్లో..

ఇచ్ఛాపురం- పిలక రాజ్యలక్ష్మి (రెడ్డిక)

పలాస కాశీబుగ్గ- తలసు శ్రీపద్మ (కాళింగ వైశ్య)

నర్సీపట్నం- చింతకాయల అనిత (కొప్పుల వెలమ)

యలమంచిలి- బొడ్డాపు తులసి (కాపు)

తుని- పిట్ల రామతులసి (శెట్టి బలిజ)

కొవ్వూరు- మన్నె పద్మ (కమ్మ)

రామచంద్రాపురం- చింతపల్లి నాగేశ్వరరావు (శెట్టి బలిజ)

కొండపల్లి- నల్లమోతు తేజస్వి (మాదిగ)

తెనాలి- మద్దాలి శేషాచలం (వైశ్య)

చీరాల- డాక్టర్ ఇష్తర్ల షెర్లి (మాల)

బద్వేలు- రాచపూడి వెంకట సాయికృష్ణ (వైశ్య)

ప్రొద్దుటూరు- పోరెడ్డి నరసింహా రెడ్డి (రెడ్డి)

పులివెందుల- వైఎస్ ప్రమీలమ్మ (రెడ్డి)

మదనపల్లి- జింకా చలపతి (బోయ)

నగర పంచాయతీల్లో..

ఏలేశ్వరం- బాదిరెడ్డి ఆశాలత (మాదిగ)

ఉయ్యూరు- పైడిముక్కల దివ్య (మాదిగ)

గురజాల- పోలా వీరారెడ్డి (రెడ్డి)

కనిగిరి- పులి శాంతి రెడ్డి (రెడ్డి)

బుచ్చిరెడ్డి పాలెం- షేక్ షకీలా బేగం (ముస్లిం)

కమలాపురం- మర్జుల కవిత (రెడ్డి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+