visakhapatnam west assembly constituency: టీడీపీ కోటలో ఈసారైనా వైసీపీ బోణీ కొడుతుందా ?
ఏపీలో రాజకీయంగా కీలకమైన విశాఖపట్నం సిటీ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ పశ్చిమ సీటు కూడా ఒకటి. విశాఖ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే విశాఖ పశ్చిమ సీటు జనరల్ నియోజకవర్గం. పూర్తిగా అర్బన్ సీటు కూడా. ఇక్కడ దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో విశాఖ పశ్చిమ సీటు ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ కంచుకోటలుగా మార్చుకున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఒకప్పటి నగర శివారు ప్రాంతాలైన గోపాలపట్నం హా పలు ప్రాంతాలు ఉన్నాయి. జనాభా పరంగా చూసినా, రాజకీయంగా చూసినా గవర కులస్తులదే ఇక్కడ ఆధిపత్యం. జనాభా పరంగా చూస్తే వీరి తర్వాత కాపులు, వెలమలు ప్రధానంగా ఉన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైన 2009 నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు ఇక్కడ గవర్లే గెలిచారు.2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మళ్లీ విజయ్ ప్రసాద్ గెలిస్తే, ఆ తర్వాత 2014, 2019లో టీడీపీ అభ్యర్ధి గణబాబు గెలిచారు.

2009లో ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ ఓట్ల చీలిక కారణంగా టీడీపీ ఇక్కడ నష్టపోయింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ (2014, 2019) టీడీపీ అభ్యర్ధే గెలిచారు. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా విశాఖ పశ్చిమ సీటులో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. ఈసారి ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన పొత్తు ప్రభావంతో వైసీపీ బోణీ కొట్టడం కష్టమేనని చెబుతున్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించడం, సంక్షేమ పథకాల ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం అధికార పార్టీ బోణీ కొట్టే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications