ఈ జిల్లాల్లో మద్యం షాపుల మూసివేత - తాజా ఆదేశాలు, అసలు కారణం..!!
మందుబాబులకు రెండు షాకింగ్ న్యూస్. రెండు రోజుల పాటు రెండు జిల్లాల్లోని వైన్ షాపులను మూసి వేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు (గురువారం) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందులో భాగంగా పోలింగ్ జరిగే పాఠశాలలతో పాటుగా రెండు జిల్లాల్లోని అన్ని వైన్ షాపులు మూసివేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ సారి ఉపాధ్యాయ ఎన్నిక జిల్లాల్లో ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.
రెండు రోజులు బంద్
గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కు రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది. దీంతో, ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రెండు రోజు పాటు.. ఈ రోజు, రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో వైన్ షాపులు మూసి వేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. రేపు పోలింగ్ జరగనుండగా.. కౌంటింగ్ ఈ నెల 9న నిర్వహించనున్నారు.

హోరా హోరీ పోటీ
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు హోరా హోరీగా సాగిన ప్రచారం ముగిసింది. బొర్రా గోపిమూర్తి, గంధం నారాయణరావు, దీపక్, కవల నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీలో ఉన్నారు. వీరిలో గోపిమూర్తి, గంధం నారాయణరావు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇప్పటికే వీరిద్దరికి ఉపా ధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో గోపిమూర్తి తొలిసారిగా బరిలో దిగారు. కాగా, గంధం నారాయణరావుకు మరో సారి అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. గోపిమూర్తికి యూటీఎఫ్‌తో పాటు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇక, గంధం నారాయణ రావుకు ఎస్టీయూ, మరికొన్ని సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ ఇద్దరి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా మారింది. వామపక్ష పార్టీలు ఈ ఇద్దరి గెలుపులో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.
పోలింగ్ కు సిద్దం
ఈ సారి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపించేలా కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా ప్రచార పర్వం ముగిసింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్ధులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆరు జిల్లాల్లోనూ 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ జరగనుంది. మొత్తం 16,737 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు పోలింగ్ సిబ్బందికి ఎన్నికల అధికారులు మెటీరియల్ అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications