వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్కౌంట‌ర్ తో ఏపి నేత‌ల దిగ్ర్బాంతి.. ! తీవ్ర ఆవేద‌న‌లో చంద్ర‌బాబు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ :అర‌కు లో జ‌రిగిన ఎన్కౌంట‌ర్ ప‌ట్ల రాష్ట్ర యంత్రాంగం ఉలిక్కి ప‌డింది. అంతా స‌వ్యంగా ఉంది, మావోల ఉనికి లేదు, శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్న‌యనుకుంటున్న త‌రుణంలో మాటువేసి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను మ‌ట్టుబెట్టిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లాన్ని రేవుతోంది. ఎప్పుడూ ప్ర‌శాంతంగా ప్ర‌క్రుతి ర‌మ‌ణీయ‌త‌తో అల‌రాడే అర‌కు ప్రాంతం మావోల హింసాత్మ‌క ఘ‌ట‌న‌తో నెవ్వ‌ర‌పోయింది. మావోల ఊహించ‌ని చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం కూడా ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసింది. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు విష‌యం తెలుసుకుని ఒక్క‌సారిగా విష‌న్న వ‌ద‌నంతో దుఃఖితుడు అయ్యాడ‌ట‌. అంతులేని ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఏపీ సీయం త‌న ప‌ర్య‌ట‌న‌ను కుదించుకునే సూచ‌న‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అర‌కు ఎన్కౌంట‌ర్ తో ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన బాబు.! ప‌ర్య‌ట‌న కుందించే ఆవకాశం..!!

అర‌కు ఎన్కౌంట‌ర్ తో ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన బాబు.! ప‌ర్య‌ట‌న కుందించే ఆవకాశం..!!

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును న‌క్స‌లైట్లు కాల్చిచంప‌డం ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని షాక్ కు గురిచేసింది. అస‌లు న‌క్స‌ల్స్ దాదాపు అంతం అయ్యార‌ని అంద‌రూ అనుకుంటున్న నేప‌థ్యంలో, ఇంకా వారి ఉనికి ఈ స్థాయిలో ఉండ‌టం రాజ‌కీయ నేత‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తోంది. ప్ర‌యాణంలో ఉన్న ఎమ్మెల్యే బృందాన్ని అడ్డ‌గించి, బంధించి పాయింట్ బ్లాంక్‌లో కాల్చ‌డం దేశంలో కూడా క‌ల‌క‌లాన్ని రేపింది. న‌క్స‌ల్స్‌పై పోలీసులు ఏమ‌రుపాటు వైఖ‌రి ఈ సంఘ‌ట‌న నిరూపిస్తోంది. మ‌న్యం ప్రాంతంలో మావోల కద‌లిక‌లు ఉన్నాయ‌ని నిర్ధార‌ణ జ‌రిగినా ఇంటెలీజెన్స్ వ్య‌వ‌స్థ ఎందుకు అప్ర‌మ‌త్తంగా లేద‌నేది ఇక్క‌డ ప్ర‌ధాన చ‌ర్చ‌.

మావోల క‌ద‌లిక‌ల‌ను ప‌సిగ‌ట్ట‌లేక పోయిన ఇంట‌లిజెన్స్..! అదును చూసు వేటేసిని మావోలు..!!

మావోల క‌ద‌లిక‌ల‌ను ప‌సిగ‌ట్ట‌లేక పోయిన ఇంట‌లిజెన్స్..! అదును చూసు వేటేసిని మావోలు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌త్వ‌ర అభివ్రుద్ది కోసం నిరంత‌ర శ్రామికుడిలా ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబు తీవ్ర వేద‌న‌లో ప‌డిపోయారు. చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌టం అంటే ఒక భ‌రోసా. ముఖ్యంగా వాణిజ్య రంగాన్ని ప‌రుగులు పెట్టించే బాబు అతి క్లిష్ట స‌మ‌యంలో ఆర్థిక లోటు భ‌యంక‌రంగా ఉన్న స‌మ‌యంలో ప‌గ్గాలు చేప‌ట్టారు. నిజానికి అధికారం రావ‌డం చాలామందికి అదృష్టంగా క‌నిపించినా చంద్ర‌బాబుకు మాత్రం కాదని చెప్పాలి. అంత లోటు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం కంటే ప్ర‌తిప‌క్షంలో కూర్చోవ‌డ‌మే సుఖమ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కాని అభివృద్ధి అంతు చూడ‌డం చంద్ర‌బాబుకు ఒక అల‌వాటు, ఓ వ్య‌స‌నం. అందుకే అలుపెర‌గ‌ని విదేవీ ప‌ర్య‌ట‌న‌ల‌కు రూక‌ల్ప‌న చేస‌కుంటారు చంద్ర‌బాబు.

అభివ్రుద్దికి మావోల చ‌ర్య‌లు ఆటంకం..! రేపు ఏపి కి చేరుకోనున్న డీజీపి..!!

అభివ్రుద్దికి మావోల చ‌ర్య‌లు ఆటంకం..! రేపు ఏపి కి చేరుకోనున్న డీజీపి..!!

ప్ర‌కృతి హుదూద్ పేరిట సృష్టించిన ప్ర‌కోపాన్ని కూడా అధిగ‌మించి విశాఖ‌ప‌ట్నం మ‌రింత సుంద‌రంగా మార్చిన చంద్ర‌బాబుకు ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఒక శాస‌న‌స‌భ్యున్ని కిరాత‌కంగా హ‌త్య చేయ‌డం తీవ్రంగా క‌ల‌చివేసింది. రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్రానికి మ‌రిన్ని కంపెనీలు తేవ‌డం కోసం అమెరికాకు బ‌య‌లుదేరిన చంద్ర‌బాబుకు అక్క‌డ దిగ‌క ముందే షాక్ లాంటి వార్త తెలిసింది. దుబాయ నుంచి న్యూయార్క్ ఫ్లైట్లో బ‌య‌లుదేరిన వెంట‌నే ఆయ‌న‌కు ఈ వార్త అందడంతో ఆయ‌న‌లో క‌న్నీళ్లు తిరిగాయ‌ని ఆయ‌న‌తో పాటు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఒక ప్ర‌ముఖ అధికారి తెలిపారు. దీంతో చంద్ర‌బాబు నాయుడు కొద్ది సేపు నిస్స‌హాయ‌స్థితిలోకియ వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం పై నిరాశ‌లు..! డిస్ట‌ర్బ్ ఐన బాబు ఏకాగ్ర‌త‌..!!

పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం పై నిరాశ‌లు..! డిస్ట‌ర్బ్ ఐన బాబు ఏకాగ్ర‌త‌..!!

కేంద్రం నుంచి ప్ర‌తిప‌క్షాల నుంచి ఏ స‌హ‌కారం లేక‌పోయినా ఏదో విధంగా ముందుకు దూసుకెళ్తున్న ఏపీ, బాబు అమెరికా టూరుతో మ‌రిన్ని కంపెనీల‌ను సొంతంగా వ‌స్తాయ‌ని టీడిపి అభిమానులు, ఏపీ ప్ర‌జ‌ల ఆశ ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. కాని చంద్ర‌బాబు అమెరికా ప‌ర్య‌ట‌న లో కొన్న మార్పులు చేసుకోవ‌ట‌మే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. అమెరికా లోని కొన్ని సాఫ్ట్ వెర్ కంపెనీల అప్పాయింట్ మెంట్ ని చంద్ర‌బాబు క్యాన్సిల్ చేసే అవ‌కావాలు ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ను కుదించుకుని ముందుగా ఇండియాకు తిరిగి రానున్న‌ట్లు తెలుస్తోంది.

Recommended Video

అరకు ఎమ్మెల్యే కాల్చివేత నేపథ్యంలో జగన్ కు భద్రత పెంపు

English summary
The Araku MLA Kidari Surveshwara Rao was shot dead by Naxalites to shock the state machinery. There is no Maoists existence, and the situation in which the lawmakers are abused when the law is going to be in control.Chandrababu, who is on a trip to America, has become a mourner for the first time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X