సీఎం జగన్ చేతికి బీజేపీ కొత్త అస్త్రం, కలిసొచ్చేనా - టీడీపీలో అదే టెన్షన్..!!

ఏపీలో పొత్తుల లెక్కలు తేలుతున్నాయి. ఇప్పటి దాకా జరిగిన చర్చలు..ప్రతిష్ఠంభనకు మూడు సభలతో క్లారిటీ వచ్చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత అసలు బీజేపీ ఆలోచన ఏంటనే చర్చ మొదలైంది. ఇప్పుడు టీడీపీతో కలుస్తామని నేరుగా చెప్పకపోయినా..పార్టీ అధ్యక్షుడు నడ్డా..హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు మాత్రం అవే సంకేతాలు ఇచ్చాయి. బీజేపీ మద్దతు తనకు లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. బీజేపీ నుంచి సంకేతాలు వస్తున్న వేళ సీఎం జగన్ చేతికి కొత్త అస్త్రం అందింది. అదే ఇప్పుడు టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైంది.

మూడు పార్టీలు కలుస్తాయా: ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవ్వటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు పైన విముఖంగా ఉన్న బీజేపీ నేతల తీరులో మార్పు కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో బీజేపీ కీలక నేతలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కొత్త ప్రతిపాదన చేసారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీని పైన బీజేపీ నేతలతోనూ చర్చించారు. తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దీనికి కొనసాగింపుగా ప్రతిపాదనలు అందించారు. తాజాగా ఏపీ కేంద్రంగా నడ్డా.. అమిత్ షా ఏపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు..ముఖ్యమంత్రి స్పందనతో జరిగేదేంటో క్లారిటీ వచ్చేసింది.

2014కి ఇప్పటికీ తేదా ఇదే: 2014లో ఈ మూడు పార్టీలు జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేసాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 1.95 శాతం ఓట్ల తేడాతో ప్రతిపక్షానికి పరిమితం అయింది. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ తో పాటుగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేసాయి. వైసీపీ 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కేంద్రం -ఏపీ ప్రభుత్వం మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంతో తనతో కలిసి వచ్చే పార్టీలతో ఎన్డీఏను విస్తరించాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా వైసీపీ తమతో కలిసే అవకాశం లేదని నిర్దారణకు వచ్చింది. టీడీపీ పొత్తుకు సిద్దంగా ఉండటం తో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు వద్దని తేల్చి చెబుతున్నారు. బీజేపీ ఇంకా పొత్తుపై అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సమయంలోనే టీడీపీలో ఒక వైపు పొత్తు ఆలోచనలు చేస్తూనే..పార్టీలో మాత్రం మరో చర్చ మొదలైంది.

BJP TDP and Janasena

సీట్ల వ్యవహారం...అసలు సమస్యల: బీజేపీ,జనసేనతో పొత్తు ఖరారు అయితే సీట్ల సర్దుబాటు సమస్యగా మారనుంది. ఈ ఎన్నికల్లో ప్రతీ సీటు గెలుపు కీలకమే. బీజేపీకి ఓట్ బ్యాంక్ చాలా తక్కువ. బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీకి కలిగే ప్రయోజనం లేదు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో సహకారం కోసమే పొత్తు కోరుకుంటోందనే వాదన ఉంది. ఆ సహకారం జగన్ కు లేకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. జనసేనకు 25-30 వరకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. బీజేపీ 10-15 వరకు సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా 40-45 సీట్ల వరకు ఈ రెండు పార్టీలకు వెళ్తే..గెలిచేది ఎన్ని అనేది ఇప్పుడు సందేహంగా మారుతోంది. ఇన్ని సీట్లు సొంత పార్టీ నేతలను కాదంటే..ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన నేతల పరిస్థితి ఏంటనేది మరో చర్చ. పొత్తులు కోరుకుంటున్నా..అభ్యర్దుల ప్రకటన సమయంలో మాత్రం సమస్యలు తప్పదనే అభిప్రాయం ఉంది.

BJP TDP and Janasena

ఏపీకి హామీలు..జగన్ చేతికి అస్త్రాలు
దీంతో పార్టీ నుంచి రెబల్స్ బరిలోకి దిగే అవకాశాలు ఉంటాయి. 2014 ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ చేసినా జనసేన బరిలో లేదు. ఈ సారి జనసేనకు బీజేపీ కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లోనే బీజేపీకి 4 సీట్లలో మాత్రమే గెలిచింది. అప్పుడు ప్రధాని అభ్యర్ధిగా మోదీ ఛరిష్మా బలంగా ఉంది. హోదాతో పాటుగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఇప్పుడు బీజేపీ దోషిగా నిలబడింది. ఇప్పటి వరకు అప్పుడప్పుడు జగన్ ను ఈ అంశాల్లో టార్గెట్ చేస్తున్న టీడీపీ, జనసేన ఎప్పుడు బీజేపీని మాత్రం ప్రశ్నించలేదు. ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు అఫీషియల్ అయితే జగన్ కు వీటి పైన తాను పదే పదే కోరినా కేంద్రం స్పందించలేదని..చంద్రబాబు వారితో జత కలిసారనే ప్రచారం ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో..మూడు పార్టీల కలయిక జగన్ కు అనుకూలంగా మారనుందనే చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+