వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ భ‌యంతోనే మ‌ధుపై శిల్పా వ‌ర్గీయుల దాడి, జగన్ మాట మీద నిలబడాలి: సోమిరెడ్డి

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఒడిపోతామనే భయంతోనే గురువారం అభిరుచి మధుపై శిల్పా వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఆరోపించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజ‌య‌వాడ‌: నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఒడిపోతామనే భయంతోనే గురువారం అభిరుచి మధుపై శిల్పా వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఆరోపించారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలతోనే వైసీపీ నేతలు హింసకు దిగుతున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో 25 వేల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల‌లో అధికార దుర్వినియోగం జరిగిందన్న ప్రచారం అవాస్తవమన్నారు. మూడేళ్ల పాలనకు రెఫరెండంగా నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అని చెప్పిన జగన్, తన మాట మీద నిలబడాలని సవాల్ విసిరారు.

somireddy

రాష్ట్రంలోని రైతులకు మూడో విడత రుణమాఫీకి పది శాతం వడ్డీతో కలిపి రూ. 3,600 కోట్లను త్వరలో విడుదల చేయ‌నున్న‌ట్టు చెప్పారు. గ‌తేడాది క‌న్నా ఈ ఏడాది 30 శాతం అధికంగా సాగు జరుగుతోందని- ఒక్క కర్నూల్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు.

ప్రకృతి విపత్తులకు గురైన రైతులకు పరిహారం నగదు నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ అవుతోందన్నారు. వ్యవసాయశాఖను గాలికొదిలేసి తాను ఉప ఎన్నికలకు మాత్రమే పరిమితం అయ్యార‌నే ఆరోప‌ణ‌ల్ని ఆయ‌న ఖండించారు.

శాఖా పరంగా చేపట్టాల్సిన బాధ్యతలను అధికారులకు అప్పగించి ఎన్నికల ప్రచారానికి వెళ్ళానని స్ప‌ష్టంచేశారు. ప్రతిపక్ష నేత జ‌గ‌న్ త‌న బాధ్యతను మరిచి నంద్యాలలోనే మకాం వేశారని అన్నారు.

English summary
Andhra Pradesh Agriculture Minister Somireddy Chandra Mohan Reddy allegedly told that with the defeat fear in nandyal by election only shilpa group attacked Abhiruchi Madhu on Thursday. After participating in a review meeting of agriculture department in AP Secretariat at Amaravathi, Somireddy spoken with Media. He challenged YS Jagan that he should stand to his words regarding Nandyal Bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X