ఇద్దరు పిల్లలను రైలు కిందికి తోసేసి తల్లి కూడా ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేట లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి పిల్లలతో సహాతల్లి ఆత్మహత్యకు పాల్పడింది. నాదెండ్ల మండలం అప్పాపురం కు చెందిన విజయలక్ష్మి దిగ్విజయ (7),గణేష్ సాయి (5) అను ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వీరు సమీపం లో ఉన్న మార్టూరు గ్రామంలో చదువుతున్నారు. సోమవారం మార్టూరు లో చదువుకుంటున్న పిల్లల్ని తల్లి విజయలక్ష్మి నరసరావు పేట కు తీసుకు వచ్చింది. ఊరు నుండి పిల్లలని తీసుకువస్తూనే నరసరావుపేట 2 వ గేట్ వద్ద గూడ్స్ ట్రైన్ రావటం చూసి పిల్లలిద్దరి తోసేసి ఆమె కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

woman along with children commits suicide in guntur district

అయితే హృదయం కలచివేసే విషయం ఏమిటంటే సోమవారమే విజయలక్ష్మి కూతురి దిగ్విజయ పుట్టినరోజు కావడం. అయితే విజయలక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది.

జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమికం గా కుటుంభ కలహాల నేపధ్యం లోనే విజయలక్ష్మి తన ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman Vijayalakshi has commited suicide at Narsaraopet in Guntur district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి