అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపబోయి, మర్మాంగాన్ని మెలి తిప్పుతూ....
అక్రమ సంబంధానికి భర్తను అడ్డు తొలగించుకోవడానికి భర్తను హత్య చేయడానికి ఓ మహిళ ప్రయత్నించింది. ప్రియుడితో కలిసి ఆ పనికి ఒడిగట్టింది.
గుంటూరు: తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి ఓ యువతి ప్రయత్నించింది. అయితే, కథ అడ్డం అడ్డంతిరిగింది. భర్త బంధువులు పసిగట్టి వారిద్దరినీ చితకబాది బంధించారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి - మేకల సుధారాణి అదే గ్రామానికి చెందిన వీర నీలాంజనేయులుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగిస్తోంది. తమ సంబంధానికి భర్త చిన అమ్మోరయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన సుధారాణి ప్రియుడితో కలిసి భర్తను చంపాలని ఫథకం వేసింది. ఆదివారం అర్థరాత్రి దాటాక ప్రియుడు నీలాంజనేయులుకు ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది.
నిద్రిస్తున్న అమ్మోరయ్యను చంపేందుకు పూనుకుంది. నీలాంజనేయులు దిండుతీసి అమ్మోరయ్య ముఖంపై ఉంచి ఊపిరాడకుండా చేస్తూ మరో వైపు ఇటుక రాయితో గుండెపై బాదుతుండగా సుధారాణి అమ్మోరయ్య మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచే యత్నం చేసింది. షాగ్ నుంచి తేరుకున్న అమ్మోరయ్య వారిని ప్రతిఘటిస్తూ బిగ్గరగా కేకలు వేశాడు. పక్క ఇంట్లో నిద్రిస్తున్న అమ్మోరయ్య అన్న కుమార్తె అమల, తల్లి తిరుపతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి రాకను పసిగట్టిన నీలాంజనేయులు తన ఇంటికి పారిపోగా సుధారాణి డాబాపై ఎక్కి దాక్కుంది.

వారి దుర్మార్గంతో నిలువెల్లా రగిలిపోయిన అమ్మోరయ్య బంధువులు నీలాంజనేయులు, సుధారాణిలను వెతికి పట్టుకొచ్చి దేహశుద్ధి చేశారు. వారిని తాళ్లతో కట్టేసి అదే ఇంట్లో తెల్లారేదాకా నిర్బంధించారు. అనంతరం దుర్గి పోలీసులకు అప్పగించారు. సుధారాణి, నీలాంజనేయులు దాడిలో కనపడని దెబ్బలతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు చిన అమ్మోరయ్యను బంధువులు ఆ రాత్రే మాచర్లలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపారు. సుధారాణి, చిన అమ్మోరయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దుర్గి ఎస్‌ఐ సుబ్బానాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications