ఈమె మహా ముదురు: మూడు పెళ్లిళ్లు, మూడు ప్రేమలు, నడిరోడ్డుపై నాటకం

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఓ మహిళ భారీ నాటకానికి తెర తీసింది. ముగ్గురిని వివాహం చేసుకుంది. మరో ముగ్గురితో ప్రేమ నాటకం ఆడింది. వారితో అవసరం తీరిన తర్వాత బ్లాక్ మెయిల్‌కు దిగుతోంది. అలా కూడా కాకపోతే పోలీసుల పేరు చెప్పి బెదిరిస్తోంది. అలా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ వచ్చింది.

వారితో పని ముగిసిన తర్వాత ఆత్మహత్యాయత్నానికి నడిరోడ్డుపై తెర తీసింది. ఈ సంఘటన ఆదివారం వట్టిచెరుకూరు రోడ్డులో ప్రారంభమైంది. ఆత్మహత్యాయత్నం చేసిన నూతలపాటి మహిత అనే ఆ మహిళ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.

ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు రహదారి మధ్యలో ఓ మహిళ ఓ చేతిలో పురుగు మందు, మరో చేతిలో కూల్‌డ్రింక్‌ సీసా పట్టుకుని కూర్చుని ఉంది. రెండు సీసాల మూతలు తొలగించి ఒకదానిలో ఒకటి కలుపుకుని తాగే ప్రయత్నం చేసింది.

Woman cheats with three marriages

ఆ దారి గుండా వెళ్లేవారు గమనించి 108కు ఫోన్‌చేసి ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆమె కొద్దిగా తాగినట్లు అనుమానిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన ఆమెకు ప్రథమ చికిత్స అనంతరం వివరాలు తెలుసుకున్నారు.
పాతగుంటూరు మణి హోటల్‌ ప్రాంతంలో నివసించే దేవదాస్‌ దంపతుల కుమార్తె 27 ఏళ్ల మహిత .

ఆమె 12 ఏళ్ల క్రితం శేఖర్‌ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. వారికి ఓ కూతురు కూడా ఉంది. రెండేళ్ల తర్వాత అతడిని వదిలేసి పాత గుంటూరులోనే మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. రెండేళ్ల తరువాత కొరిటెపాడుకు చెందిన శ్రీమన్నారాయణ అనే వివాహితుడిని మూడో పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత మరో ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఆ యువకులు ఆమెను ఏడాది క్రితం వదిలించుకున్నారు. తిరిగి శ్రీమన్నారాయణ వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేసింది. ఇవ్వకపోతే మనిద్దరం కలిసి ఉన్న ఫొటోలు అందరికి చూపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేసింది. దీనితో శ్రీమన్నారాయణ పాత గుంటూరు పోలీసులను ఆశ్రయించగా మహితను పిలిపించి మందలించి పంపినట్లు తెలుస్తోంది.
అయితే పాత గుంటూరు సీఐ ఈ ఘటనలో ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు. దీనితో మహిత మీ అందరి అంతు చూస్తానని వెళ్లి ఆదివారం అనంతవరప్పాడు రోడ్డులో ఈ ఘటనకు పాల్పడింది. ఆసుపత్రికి వచ్చిన ఆమె బంధువులు మహిత చరిత్రను పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వట్టిచెరుకూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman has attempted to kill herself in Guntur district of Andhra Pradesh.
Please Wait while comments are loading...