పుట్టెడు దుఃఖంలోనూ భర్త అవయవాలను దానం చేసిన మహిళ
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో మానవత్వం మరి కొంత మందికి ప్రాణదానం చేసింది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తన భర్త అవయవాలను దానం చేసేందుకు ఆ మహిళ ముందుకు వచ్చింది. తద్వారా మరి కొంతమందికి జీవదానం చేసేందుకు ఆ బాధితురాలు సహాయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన అడపాల మస్తాన్ (34) తన కుమార్తె మైథిలీ ప్రియ (9)తో కలిసి వ్యక్తిగత పనిమీద మోటారు సైకిల్‌పై సర్వేపల్లికి వెళ్లున్నాడు. మార్గమధ్యంలో ఎగువ మిట్టవద్ద మోటారు సైకిల్, వ్యాను ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో మైథిలి ప్రియ గాయపడగా మస్తాన్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరిని హుటాహుటిన నెల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడనుంచి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సకోసం నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మస్తాన్‌ను పరిశీలించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు.
అతను కొలుకునే పరిస్థితిలేదని చెప్పటంతో అతని అవయవాలు దానం చేసేందుకు అతని భార్య శాంతితో పాటు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఈ విషయాన్ని చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తెలియజేయడంతో ఆ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక వైద్య బందం నెల్లూరుకు వెళ్లి మస్తాన్ అవయవాలను సేకరించనుంది.












Click it and Unblock the Notifications