భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై ఐదుగురు గ్యాంగ్ రేప్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తంబిలిపట్నం అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. భర్తను చెట్టుకు కట్దేసి అతని ఎదుటే భార్యపై ఐదుగురు దుండుగులు సామూహిక అత్యాచారం చేశారు. బైక్‌పై వెళ్తున్న దంపతులను ఆపిన వారు భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు.

వారంరోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి దంపతులు ఇద్దరు కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Woman gang raped in Nellore district

ఎర్రచందనం స్మగ్లర్ పై పిడి యాక్ట్

ఎర్రచందనం స్మగ్లర్‌ ప్రవీణ్‌పై పీడీయాక్టు నమోదు చేసినట్లు తిరుపతి అర్బన్‌ ఎస్పీ గోపీనాథ్‌ చెప్పారు. నిందితుడు ప్రవీణ్‌ వంటవాడిగా పనిచేస్తూ ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడని ఎస్పీ చెప్పారు. ఎర్రచందనం ఖైదీల పరిచయాలతో ప్రవీణ్ స్మగ్లర్‌గా మారాడని, ఇతను ఇప్పటి వరకు 108 ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేశాడని గోపీనాథ్ వివరించారు.

14 మంది అరెస్టు

కడపకు చెందిన బిషప్ ప్రసాద్ ను కిడ్బాప్ చేసి చితకబాదిన కేసులో జమ్మలమడుగులోని డాడీ హోమ్ చైర్మన్ రాజారెడ్డి సహా 14 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గత నెల 25వ తేదీన బిషప్ ప్రసాద్ ను 14 మంది కిడ్బాప్ చేసి శారీరకంగా హింసించారు. ఆ తర్వాత మైదుకూరు - చాగలమర్రి రోడ్డులో పడేశారు.

బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం బాైం 14 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పి గులాటీ మీడియా సమావేశంలో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+