ఆడపిల్లలని: బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య (పిక్చర్స్)
విశాఖపట్నం: ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి చంపి తాను ఉరేసుకుని చనిపోయింది. ఈ సంఘటన విశాఖపట్నంలో జరిగింది ఆడపిల్లలను కన్నావని వేధించడం భర్త వేధించడం వల్లనే ఈ పనికి ఆమె ఒడిగట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అర్చన (24)కు, విశాఖపట్నానికి చెందిన ఆకుల సతీష్‌కల్యాణ్‌చక్రవర్తి (35)తో 2011 అక్టోబర్ 16న హైదరాబాద్‌లో వివాహం జరిగింది.
వివాహ సమయంలో రూ.2.5 లక్షల కట్నం, పది తులాల బంగారం ఇతర లాంఛనాలు ఇచ్చారు. కల్యాణ్‌చక్రవర్తి నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. మధురానగర్‌లోని ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని చక్రవర్తం కుటుంబం, తల్లి పద్మ గంగాభవానీ, సోదరుడు విశ్వనాథం కుటుంబం కలిసివుంటున్నారు.
ఆడపిల్లకు జన్మనిచ్చావంటూ భార్యను చక్రవర్తి వేధించేవాడు. ఆడపిల్ల పుట్టినందున ఆమె బాగోగుల కోసం అదనపుకట్నం ఇవ్వాలని వేధించేవాడు. ఆడపిల్లను ప్రసవించిన ఆరు నెలలకు అర్చనను హైదరాబాద్ నుంచి నగరానికి తీసుకువచ్చాడు. అనంతరం 2014లో అర్చన తిరిగి ఆడపిల్లను ప్రసవించడంతో చక్రవర్తి తట్టుకోలేకపోయాడు. ప్రసవించిన నెల రోజులకు నగరానికి తీసుకువచ్చాడు. అయితే అప్పటి నుంచి భర్తవేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తరచూ చేయిచేసుకోవడం, అందుకు అత్త కూడా సహకరిస్తుండడంతో అర్చనకు జీవితంపై విరక్తిచెందింది. భర్త, అత్తల వేధింపుల గురించి నేవీలో ఉద్యోగం చేస్తూ షీలానగర్‌లో వుంటున్న తన సోదరుడు బి.ఆనంద్‌కుమార్‌కు అర్చన తెలిపేది.
మంగళవారం ఉదయం ఎవరి పనులకు వారు వెళ్లిపోగా ఇంట్లో వున్న అర్చన తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అర్చన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అర్చన తోటికోడలు కోటేశ్వరి గది వద్దకు వెళ్లి తలుపుతట్టగా లోపల గడియపెట్టివుండడంతో అనుమానం వచ్చి ఇరుగుపొరుగువారిని పిలిచి విషయాన్ని తెలియజేసింది. వారంతా బలంగా నెట్టడంతో తలుపుతెరుచుకుంది.
ఆడపిల్లలు పుట్టారని భర్త వేధించడం వల్లే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని ఆనంద్ ఆరోపించారు. పిల్లలకు పాలడబ్బాకూడా తెచ్చేవాడు కాదని, ఒకవేళ తన సోదరి అడిగితే చిత్రహింసలు పెట్టేవాడని ఆరోపించారు. తన సోదరి ఆత్మహత్యకు పాల్పడితే కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల చక్రవర్తితోపాటు అతని సోదరుడు విశ్వనాథంపై ఆనంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు.

పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య
అర్చన అనే మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆడపిల్లలను కన్నావని వేధించడం వల్లనే ఈ పనికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.

పాలలో విషం కలిపి..
అర్చన ఫ్యాన్‌కు వేలాడుతూ వుండగా, ఇద్దరు పిల్లలు మంచంపై అచేతనంగా పడివున్నారు. దగ్గరకు వెళ్లి చూడగా చిన్నారుల నోటి నుంచి నురగలుకక్కుతూ వుండడంతో పాలలో విషం కలిపి ఇచ్చి అర్చన ఆత్మహత్యకు పాల్పడివుంటుందని భావిస్తున్నారు.

భర్తకు సమాచారం ..
డ్యూటీలో వున్న అర్చన భర్తకు సమాచారం అందజేశారు. చక్రవర్తి ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు అక్కడికి చేరుకుని నగరంలో వుంటున్న మృతురాలి సోదరుడు ఆనంద్‌కుమార్‌కు సమాచారం అందజేయడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు.

పోలీసుల అదుపులో భర్త
సంఘటనా స్థలానికి ఏసీపీ డీఎన్ మహేష్, ద్వారాకాజోన్ సీఐ పీవీవీ నర్సింహారావు తదితరులు చేరుకుని సమాచారం సేకరించారు. చక్రవర్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

ఆడపిల్లలు పుట్టారని వేధింపులు
వివాహం జరిగిన తర్వాత అర్చన వైవాహిక జీవితం బాగానే వున్నప్పటికీ 2012లో ఆడపిల్లకు జన్మనివ్వడంతో భర్త వేధింపులు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications