అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన మహిళ
చిత్తూరు: వివాహితేర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను చంపేసింది. ఈనెల 13న జరిగిన హత్య కేసులో మృతుడి భార్యను, ఆమె ప్రియుడిని చిత్తూరు జిల్లాలోని కేవీబీపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
పోలీసు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం - కెబిపురం మండలంలోని కొత్తూరుకు చెందిన మణి, దేవి(30)లు భార్యభర్తలు. దేవికి తన పక్క గ్రామమైన రాగిగుంటకు చెందిన మొగల్‌రఫీ(36)తో అక్రమసంబంధం ఏర్పడింది. దీంతో ఇదివరకు మొగల్‌రఫీని చంపేందుకు మణి ప్రయత్నించాడు. దాంతో మణి జైలు జీవితాన్ని అనుభవించి ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఆ తర్వాత కూడా దేవి, మొగల్‌రఫీల అక్రమసంబంధం కొనసాగుతుండటాన్ని మణి గుర్తించాడు. దాంతో భార్య దేవితో గొడవడ్డాడు. ఈనెల 10న దేవి పుట్టింటికి వెళ్లింది. పుట్టింటి నుంచే పథకం రచించి భార్య, ప్రియుడు కలిసి మణిని హత్య చేసేందుకు కుట్రపన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 13న రాత్రి మొగల్‌రఫీ ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న మణీని కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు.
ఆ తర్వాత తన చెల్లెలి భర్త అయిన షాకీర్ (35)తో కలిసి హైదరాబాద్‌కు పరారయ్యాడు. దీనిపై కేసు నమోదుచేపట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. మంగళవారం బెయిల్ కోసమని శ్రీకాళహస్తిలోని బంగారమ్మ దేవాలయం వద్ద ఉన్న మొగల్‌రఫీ, షాకీర్‌ను అదుపులోకి తీసుకుని విచారించటంతో విషయం తేలిందని పోలీసులు తెలిపారు. తిమ్మసముద్రంలో ఉన్న మృతుడి భార్య దేవిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications