తల్లేనా: కుమారుడిని చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసింది
గుంటూరు: ఓ వ్యక్తిపట్ల కన్నతల్లే కసాయిగా మారింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెంలో గురువారంనాడు వెలుగు చూసింది. కన్న కుమారుడిని ఓ తల్లి చంసేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసింది.

మృతుడిని కోటేశ్వర రావుగా గుర్తించారు. తల్లి అంజమ్మ, మృతుడి మేనమామతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో ముక్కలు ముక్కలు చేసి ఉన్న శరీర భాగాలు వారికి కనిపించాయి.
దాంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అంజమ్మ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు












Click it and Unblock the Notifications