సిజేరియన్‌కు వెళ్తే మూత్ర విసర్జన పేగును కట్ చేసిన తెనాలి వైద్యులు
గుంటూరు: తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన ఒక నిండు చులాలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకంతో మృత్యువాత పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ చేయించుకునేందుకు శనివారం ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.
ఆపరేషన్‌ను ప్రారంభించిన వైద్యులు పొరపాటున ఆ మహిళ మూత్ర విసర్జన పేగును కట్ చేశారు. దీంతో ఆమె నోరు, ముక్కు నుంచి మూత్రం బయటకు వచ్చింది. దీంతో వెంటనే ఆమె పరిస్ధితి విషమంగా ఉందంటూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా బంధువులకు సూచించారు.
అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మహిళ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పరిస్ధితి కాస్త ఉద్రిక్తంగా మారింది. పరిస్ధితిని అదుపు చేసేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలు
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క దాడితో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి హత్య
నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కలువాయి మండలం తెలుగురాయపురం గ్రామంలోని ఇసుక రీచ్‌లో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. మృతుడు చేజర్ల మండలానికి చెందిన మనోహర్‌రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు ఇసుక మాఫియా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications