ఒడిశా సీఎం నాకు స్నేహితుడు, పోలవరంపై 'కొత్త ట్విస్ట్': ఇదీ చంద్రబాబు వ్యాఖ్య
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశం అనూహ్య మలుపు తీసుకోనుందా? అంటే కావొచ్చునని చెప్పవచ్చు. ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆయన తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు మంచి స్నేహితుడు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒడిశాలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలవరం ప్రాజెక్టుపై ఆయన అలా చేస్తున్నారని తనకు అనిపిస్తోందని చెప్పారు.

ఒడిశా సీఎంతో మాట్లాడుతా
పోలవరం ప్రాజెక్టు విషయమై తాను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌తో మాట్లాడుతానని చెప్పారు. ఇప్పటికే చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన వెనక్కి తగ్గారని చెప్పారు. కాగా, చత్తీస్‌గఢ్ తగ్గిందని, ఒడిసా సీఎంతో మాట్లాడుతానని, ఆయన కూడా తగ్గుతారని చంద్రబాబు చెప్పడం కొత్త ట్విస్ట్.

అడ్డుకున్న రాష్ట్రాలు
పోలవరం ప్రాజెక్టును ఒడిశా, చత్తీస్‌గడ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు సుప్రీం కోర్టు దాకా వెళ్లాయి. ఇప్పుడు చంద్రబాబు తాను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానని చెప్పడం గమనార్హం. ఇది ఎవరూ ఊహించని ట్విస్ట్ అని భావించవచ్చు. చంద్రబాబు మంగళవారం మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలని
పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం ఈ భేటీ సందర్భంగా చర్చకు వచ్చింది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలని ఒడిశా భావిస్తోందని అధికారులు.. చంద్రబాబుకు చెప్పారు. మరోవైపు, సుప్రీం కోర్టులోను పోలవరంపై మంగళవారం విచారణ జరిగింది. ముగ్గురు సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచిస్తూ ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది.

సుప్రీం సూచన మన మంచికే
ఈ నేపథ్యంలో చంద్రబాబు.. మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. సుప్రీం కోర్టు సూచన మన మంచికేనని చెప్పారు. మూడు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే ఫలితం ఉంటుందని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ప్రధానియే సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇది ఏపీకి మంచి పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇది కొత్త ట్విస్ట్ అని వ్యాఖ్యానించారు. కాగా, పోలవరం పూర్తి చేసే సలహాలే తాను వింటానని, అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు సోమవారం అన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications