అమరావతికి రుణం వేళ కొత్త కండీషన్లు - తనిఖీలు, డెడ్ లైన్లు..!!
రాజధాని అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు అయింది. రూ 13,592 కోట్ల రుణం లో భాగంగా ప్రపంచ బ్యాంకు నుంచి 6,796 కోట్లు, ఆసియా అభివృద్ధి బ్యాంకు 6,796 కోట్లు ఇవ్వనున్నారు. ఈ రుణం ఆరేళ్ల పాటు విడతల వారీగా విడుదల కానుంది. ఇదే సమయంలో ప్రపంచ బ్యాంకు పలు కండీషన్లను విధించింది.ప్రతి ఆరు నెలలకోసారి ప్రపంచబ్యాంకు బృందం క్షేత్రస్థాయిలో పనులను తనిఖీ చేస్తుంది. సంతృప్తి చెందితేనే మలి విడత నిధులు విడుదల చేయనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
షరతులు వర్తిస్తాయి
అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం వేళ ఆసక్తి కర ఒప్పందాలు జరిగాయి. సీఆర్డీఏకు ప్రపంచ బ్యాంకు లక్ష్యాలు నిర్దేశించింది. వీటికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించింది. నిర్మాణ పనులనూ పర్యవేక్షించనున్న ప్రపంచ బ్యాంకు.. సంతృప్తి చెందితేనే మలి విడత నిధులు విడుదల చేయనుంది. రుణం మంజూరుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు శుక్రవారం రుణ షెడ్యూల్‌ను విడుదల చేయడంతోపాటు కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఈ మొత్తం నిధులను అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చించాలని స్పష్టం చేసింది. తొలి విడత రుణం కింద రూ.348.33 కోట్లను జనవరి నెలాఖరు నాటికి సీఆర్‌డీఏకు అందించనున్నారు.

ఆరు విడతల్లో
ఖరారైన రుణం మొత్తం ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ డెవల్‌పమెంట్(ఐబీఆర్‌డీ) విభాగం ద్వారా ప్రపంచబ్యాంకు అందిస్తోంది. మరోవైపు ఏడీబీ కూడా రూ.6,796 కోట్లను ఇంతే కాలపరిమితితో ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. 2026లో 849కోట్ల రూపాయలు(100 మిలియన్ డాలర్లు), 2027లో 1,121కోట్లు (132 మిలియన్ డాలర్లు) 2028లో 185 మిలియన్ డాలర్లు, 2029లో 218 మిలియన్ డాలర్లు, 2030లో 123 మిలియన్ డాలర్లను ప్రపంచబ్యాంకు విడుదల చేయనుంది. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు కొన్ని లక్ష్యాలను కూడా పేర్కొంది. ఆ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. ఈ ఫలితాల సాధనను బట్టి తదుపరి రుణ మొత్తాన్ని ఇవ్వనున్నారు.
లక్ష్యాల ఖరారు
అమరావతి నిర్మాణంలో భాగంగా సీఆర్‌డీఏ త్వరలో పిలవనున్న టెండర్ల ప్రక్రియను ప్రపంచ బ్యాంకు బృందం కూడా పరిశీలించింది. టెండర్ల నిబంధనలను సైతం ఈ బృందం అధ్యయనం చేసింది. టెండర్లు ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పనుల వరకు అన్నింటినీ ప్రపంచ బ్యాంకు బృందం పర్యవేక్షించనుంది. కొన్ని లక్ష్యాలను ప్రపంచ బ్యాంకు నిర్దేశించింది. అందులో భాగంగా సమర్ధవంతమైన పౌర సేవలు, స్థానిక పరిపాలన అందించాల్సి ఉంటుంది.భూ పర్యవేక్షణ-ప్రైవేట్ పెట్టుబడులకు పెద్దపీట వేయాలి. మెరుగైన కొత్త ఉద్యోగాలను కల్పించా లని సూచించిన ప్రపంచ బ్యాంకు.. సుస్థిర రవాణా వ్యవస్థలను నెలకొల్పాలని పేర్కొంది. నిధుల ను అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎడిసిఎల్) ద్వారా ఖర్చు చేయనున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications