'అమరావతి'పై బాబు బెదిరింపులో ట్విస్ట్, వైసిపి నేత ఇంట్లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో గురువారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పర్యటించారు. ఈ సందర్భంగా తమ భూములను చంద్రబాబు ప్రభుత్వం బెదిరించి లాక్కుంటుందని కొందరు రైతులు చెప్పిన విషయం తెలిసిందే.

చంద్రబాబు బెదిరించారు, అమరావతికి రుణమిస్తే: వరల్డ్ బ్యాంక్‌కు హెచ్చరిక

అయితే, రైతులు స్వచ్చంధంగా 30వేలకు పైగా ఎకరాల భూమిని ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కేవలం 750 ఎకరాలను మాత్రం ఇచ్చేందుకు ఆ పొలాల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

కొందరిలో అసంతృప్తి సహజం

కొందరిలో అసంతృప్తి సహజం

తనను నమ్మి రాజధాని ప్రాంత రైతులు 33వేల ఎకరాల భూమిని ఇచ్చారని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. తెలుగు తమ్ముళ్లు కూడా అదే గుర్తు చేస్తున్నారు. అందులో 750 ఎకరాల రైతులు అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమేనని అంటున్నారు.

  Farmers complained to the World Bank బాబు బెదిరించారు, అమరావతికి రుణమిస్తే ఆత్మహత్య | Oneindia
  రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు

  రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు

  గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు, బేతపూడి గ్రామాల్లోని మల్లెతోటలను ప్రపంచబ్యాంకు పరిశీలన కమిటీ ఛైర్మన్‌ గంజాలవేస్‌ డాస్ట్రోడిమార్ట్‌, ఐలెక్‌లు గురువారం పరిశీలించారు. పంటల కాల వ్యవధి, వచ్చే దిగుబడి, లభించే ఆదాయం తదితర అంశాలపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

  ఆసక్తికరం.. వైసిపి నేత ఇంట్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

  ఆసక్తికరం.. వైసిపి నేత ఇంట్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

  అనంతరం నిడమర్రులో వైసిపి నేత రంగారెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు.. వైసిపి, సీపీఎం నాయకులు, రైతులతో మాట్లాడారు. తుళ్లూరులోను ప్రతినిధులు రైతుల అభిప్రాయాలు సేకరించారు.

  రైతుల ఆందోళన

  రైతుల ఆందోళన

  కాగా, పలువురు రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ఎదుట తమ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మూడు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కారణంగా బంగారం వంటి తమ భూములు కోల్పోయామన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A Team of World Bank is touring the Capital area today to looking into the complaints made by some farmers who alleged that the government is forcibly grabbing their lands and demanded that the bank should not lend money to the project.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి