షారుక్ ఖాన్ కాదు.. టాప్ లో నిలిచిన ప్రభాస్
బాలీవుడ్ బాద్ షా షారుక్ హిట్ కొట్టేశాడు. జవాన్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న టాక్ తోపాటు కలెక్షన్లు కూడా పరిశీలిస్తే మరో రూ.1000 కోట్లు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పఠాన్ తో దుమ్మురేపాడు. తాజాగా జవాన్ తో రచ్చ రచ్చ చేస్తున్నాడు. అయితే ఒక విషయంలో మాత్రం ప్రభాస్ ను దాటలేకపోయాడు.
ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుక్ పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తాజాగా జవాన్ తో సూపర్ హిట్ కొట్టేశాడు. తమిళ దర్శకుడు అట్లీ దీనికి దర్శకత్వం వహించారు. కథలో కొత్తదనం లేనప్పటికీ స్క్రీన్ ప్లే రేసీగా ఉండటంతోపాటు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా అందరికీ నచ్చేసింది. తొలిరోజు ఏకంగా రూ.129.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

తొలిరోజు మంచి వసూళ్లు వచ్చినప్పటికీ ప్రభాస్ ను మాత్రం షారుక్ దాటలేకపోయాడు. ఈ ఏడాది జూన్ లో విడుదలైన ఆదిపురుష్ సినిమాకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.136.84 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆదిపురుష్ సినిమా మొదటి మూడురోజుల్లో రూ.300 కోట్లకుపైగా రాబట్టింది. ఈ రికార్డును ప్రభాస్ అధిగమించాలేకానీ మిగతావారివల్ల కాకపోవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
సెప్టెంబరు 28వ తేదీన ప్రభాస్ సలార్ విడుదల కావల్సి ఉన్నప్పటికీ ఆ సినిమా వాయిదా పడింది. నిర్మాతలు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. నవంబరులోకానీ, డిసెంబరులోకానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం కోసం అందరూ అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ కొత్త రికార్డులు కొడతాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications