వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి యనమల: ప్రత్యర్థులకు చెక్‌ పెట్టే ప్లాన్ ఇదే!

టిడిపి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు యాదవుల ఐక్యత పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాకినాడ: టిడిపి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు యాదవుల ఐక్యత పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యర్ధులకు చెక్ పెట్టేందుకు కృష్ణుడు బరిలోకి దిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

యనమలకు షాక్: ఒక్కటైన ప్రత్యర్థులు, అసంతృప్తి?యనమలకు షాక్: ఒక్కటైన ప్రత్యర్థులు, అసంతృప్తి?

తూర్పుగోదావరి జిల్లా టిడిపి రాజకీయాల్లో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిందే వేదం. అయితే 2014 ఎన్నికల తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుండి కొందరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.

యనమల, ఆశోక్‌గజపతి మధ్య సంభాషణతో నవ్వులే నవ్వులుయనమల, ఆశోక్‌గజపతి మధ్య సంభాషణతో నవ్వులే నవ్వులు

అయితే పార్టీలో చేరడమే కాకుండా తమ ఆధిపత్యాన్ని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఈ పరిణామాలు రాజకీయంగా మంత్రి యనమలకు ఇబ్బంది కల్గిస్తున్నాయనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు యనమల రామకృష్ణుడు పావులు కదుపుతున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నెలకొంది.

రాజకీయ ప్రత్యర్థులకు చెక్‌ పెట్టేలా వ్యూహం

రాజకీయ ప్రత్యర్థులకు చెక్‌ పెట్టేలా వ్యూహం

తూర్పుగోదావరి జిల్లా టిడిపిలో ఇటీవల చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలు మంత్రి యనమల రామకృష్ణుడుకు కొంత ఇబ్బందిని కల్గించాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ప్రత్యర్థులు యనమల రామకృష్ణుడుపై పైచేయి సాధించారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవి జ్యోతుల నవీన్‌కు కట్టబెట్టడం, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థివర్గం చివరి నిమిషంలో చక్రం తిప్పడంతో మేయర్ పదవి దక్కడం వంటి పరిణామాలను ప్రస్తావిస్తున్నారు. దీంతో యనమల వర్గం కూడ ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా వ్యూహలను రచిస్తోందని సమాచారం.

ప్రత్తిపాడులో యాదవుల ఐక్యత పేరుతో సభలు

ప్రత్తిపాడులో యాదవుల ఐక్యత పేరుతో సభలు

ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు చక్రం తిప్పుతున్నారు.. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల యాదవుల ఐక్యత పేరుతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే శంఖవరం మండలం కత్తిపూడి సమీపంలో ఇటీవల యనమల కృష్ణుడి సారథ్యంలో జిల్లా యాదవ మహాసభను నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల్లోని తమ వర్గానికి చెందిన వారందర్నీ రప్పించారు. ఆ తర్వాత రౌతులపూడి మండలంలో యాదవ ప్రాబల్యం ఉన్న ఎస్‌.అగ్రహారం, గిడజాం, లచ్చిరెడ్డిపాలెం, రౌతులపూడి, శృంగవరం గ్రామాల్లో కృష్ణాష్టమి, దుర్గాష్టమి వేడుకల పేరుతో యనమల కృష్ణుడు విస్తృత పర్యటనలు చేయడం మరింత చర్చనీయాంశమైంది.

స్థానికంగా దెబ్బకొట్టడమే ఉద్దేశ్యమా?

స్థానికంగా దెబ్బకొట్టడమే ఉద్దేశ్యమా?

రాజకీయ ప్రత్యర్థులను స్థానికంగా బలహీనపర్చడం ద్వారా తమ వర్గానికి ఎదురు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే యనమల వర్గీయులు ఈ వ్యూహన్ని రచించి ఉండవచ్చనే అభిప్రాయంతో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుల సంఘాల సమావేశాలను అడ్డుకొంటే రాజకీయనేతలకు ఇబ్బంది ఉంటుంది.దీంతో ప్రత్యర్థులు కూడ ఈ విషయమై నోరు మెదపడం లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

జిల్లాలో పట్టును నిలుపుకొనేందుకు

జిల్లాలో పట్టును నిలుపుకొనేందుకు

తూర్పు గోదావరి జిల్లాల్లో పట్టును నిలుపుకొనేందుకుగాను మంత్రి యనమల వర్గీయులు వ్యూహన్ని రచిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తమ వర్గాన్ని పక్కనపెట్టి ప్రత్యర్థులు రాజకీయంగా ఎదగడంపై కొంత అసంతృప్తితో ఉన్నారు.దీంతో జిల్లా పార్టీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేలా వ్యూహన్ని రచిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Ap finance minister Yanamala Ramakrishnudu brother krishnudu conducting Yadava meetings in Prattipadu assembly segments.There is a wide discussion about these meetings in Tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X