జగన్ లేఖకు యనమల కౌంటర్ : గుమ్మడి కాయల దొంగ ఎవరంటే..

హైదరాబాద్ : ఇన్ కమ్ టాక్స్ డిక్లరేషన్ స్కీమ్-2016 కింద నల్లధనం వివరాలు ప్రకటించిన వారి గురించి గోప్యత పాటిస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఎప్పుడు ప్రకటించిందో గానీ.. ఇది కాస్త ఏపీలో అధికార పక్షం-ప్రతిపక్ష మధ్య మాటల యుద్దాన్ని రాజేస్తోంది. హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి రూ.10వేల నల్లధనం వివరాలను వెల్లడించాడని వార్తలు రావడం.. సీఎం చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తూ ఆ వ్యాఖ్యలను ప్రస్తావించడంతో ఇరు పార్టీల మధ్య 'నల్లధనం' వివాదం రగులుతోంది.

ఈ విషయంలో చంద్రబాబు వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఏకంగా మోడీకి లేఖ రాయగా.. జగన్ తీరును ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ లేఖపై స్సందించిన యనమల రామకృష్ణుడు.. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు.

Yanamala counter to Jagan

నల్లధనంపై చంద్రబాబు మోడీకి లేఖ రాస్తే జగన్ ఉలిక్కిపడుతున్నాడని విమర్శించారు. వైఎస్ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసిన యనమల.. దానికి సంబంధించి సీబీఐ ఇప్పటికే వేల కోట్ల ఆస్తులను సీజ్ చేసిందన్నారు.

అక్రమ ఆస్తులు పోగేసుకున్న కేసులో జైలుకు సైతం వెళ్లొచ్చిన ఘనత జగన్ దే అంటూ విమర్శించిన యనమల.. జగన్ వద్ద అంత డబ్బు ఎలా ఉందని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+