• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇదిగో.. అన్నీ కాపీయే: జనసేన మేనిఫెస్టోపై యనమల సెటైర్లు

By Srinivas
|

అమరావతి: జనసేన పార్టీ మేనిఫెస్టోపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం స్పందించారు. పవన్ విడుదల చేసిన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంటులో కొత్తదనం ఏమీ లేదన్నారు. అందులో పేర్కొన్న ఏడు సిద్ధాంతాలు కూడా పాతవే అన్నారు. మచ్చు తునకలుగా పేర్కొన్నవన్నీ కాపీయే అన్నారు.

పన్నెండు అంశాల్లో చాలా వరకు అమలులోనే ఉన్నాయని చెప్పారు. కొన్ని మాత్రం కేంద్రం చేయవలసినవి ఉన్నాయని చెప్పారు. రేషన్ బదులుగా నగదు బదలీ అంశం కొత్తది ఎలా అవుతుందని ప్రశ్నించారు అగ్రవర్ణాలకు కార్పోరేషన్ కూడా పాత అంశమే అన్నారు.

కేంద్రం చేయని వాటిపై తాము ఒత్తిడి చేస్తున్నామని యనమల చెప్పారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నారని తెలిపారు. కాపు రిజర్వేషన్ల అంసంపై అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. తొమ్మిది షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపించామన్నారు.

ఏడు సిద్ధాంతాలు-12 హామీలు: జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసిన పవన్

Yanamala counter on Jana Sena manifesto vision document

బీసీలకు ఐదు శాతం అదనపు రిజర్వేషన్ అని చెప్పడంలో అవకాశవాదం కనిపిస్తోందన్నారు. అగ్రకులాల్లోని పేదల కోసమే బ్రాహ్మణ, వైశ్య కార్పోరేషన్లను టీడీపీ ఏర్పాటు చేసి, బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించిందని తెలిపారు. కాపీ డాక్యుమెంట్లను విజన్ డాక్యుమెంట్లుగా చెప్పడం విడ్డూరమన్నారు.

కాగా, పవన్ కళ్యాణ్ మంగళవారం తమ పార్టీ ప్రాథమిక మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో తుది మేనిఫెస్టోను మరోసారి విడుదల చేయనున్నారు. మంగళవారం ఉదయం ఆయన భీమవరంలోని మావుళ్లమ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. ఇందులో ఏడు సిద్ధాంతాలు, 12 హామీలను పొందుపర్చారు.

జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు ఇవే..

 • కులాలను కలిపే ఆలోచనా విధానం. 
 • మతాల ప్రస్తావన లేని రాజకీయం.
 • భాషలను గౌరవించే సంప్రదాయం. 
 • సంస్కృతులను కాపాడే సమాజం. 
 • ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం.
 • అవినీతిపై రాజీలేని పోరాటం. 
 • పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం.

మేనిఫెస్టోలో మచ్చుతునకలంటూ హామీలు:

 • మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు. 
 • గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు. 
 • రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ. 
 • బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు. 
 • చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు. 
 • కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పన. 
 • ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం. 
 • ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్‌. 
 • ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు. 
 • ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు. 
 • ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు. 
 • వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Jana Sena chief Pawan Kalyan while releasing the manifesto here on Tuesday vowed that he would strive to bring 33 percent reservation in all the legislative bodies. The homemakers would be supplied cooking gas free of cost, he added.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more