అకస్మాత్తుగా చంద్రబాబు, లోకేష్ ను కలిసిన నగేష్
2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రచారం చేసినా పాటలు జనాల్ని ఉర్రూతలూగించేవి. వైసీపీ విజయంలో ఈ పాటలు కూడా కీలకపాత్ర పోషించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా కావాలి జగన్.. రావాలి జగన్.. అనే పాట ఒక ట్రెండ్ ను సెట్ చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆ పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. వైసీపీకోసం అనేక పాటలు రాసిన ఆ వ్యక్తి పేరు యనమల నగేష్. బాపట్ల జిల్లా మేదరమెట్ల గ్రామానికి చెందినవారు. అటువంటి నగేష్ అకస్మాత్తుగా తన నిర్ణయం మార్చుకున్నారు.
నగేష్ తాజాగా తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబునాయుణ్ని కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులు చూసి నగేష్ చలించిపోయారని, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి చేయగలరనే నమ్మకంతో పార్టీకి పాటలు రాస్తున్నారని టీడీపీ శ్రేణులు ట్విట్టర్ లో పేర్కొన్నాయి. 13 సంవత్సరాల నుంచి ఒక్క వైసీపీకే పాటలు రాసిన నగేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా కలిశారు.

తాను రాస్తున్న పాటలకు సంబంధించిన కొన్ని వీడియోలను ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. ఈనెల 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు కూడా నగేష్ పాటలు రాస్తున్నారు. నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నావని, వైసీపీని వదిలేసి టీడీపీకి ఎందుకు పాటలు రాస్తున్నావని అతన్ని సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ విషయం వైరల్ గా మారింది. వైసీపీపై అభిమానంగా ఉండే వ్యక్తి టీడీపీకి మద్దతు తెలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు వైరల్ చేస్తున్నారు.
గత 13 సంవత్సరాలుగా జగన్ రెడ్డి కోసం పాటలు రాసిన YANAMALA NAGESH (జగన్ కి తప్ప వేరే ఎవరికీ రాయలేదు) నేడు రాష్ట్ర పరిస్థితులు చూసి చలించిపోయి, ఆవేదన చెంది చంద్రబాబు నాయుడు గారు మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఈరోజు నారా లోకేష్ గారిని హైదరాబాదులో కలవడం జరిగింది.. (1/2) pic.twitter.com/DUniWdDeZU
— Guru Dharanidhar Medasani (B -ve Blood Group) (@GuruDharanidhar) January 10, 2023












Click it and Unblock the Notifications