వైసీపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.పార్టీ ఓడిపోవడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో కురుకుపోయారు. తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ ఓడిపోవడంతో నైరాశ్యంలో మునిగిపోయారు. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఎన్నికల్లో టీడీపీ , బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఇదిలా ఉంటే ఓటమి నిరాశలో ఉన్న వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించినప్పటికి వైసీపీ తన అధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. టీడీపీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చినప్పటికి వైసీపీ కంటే ఓట్లను సాధించడంలో ఈ మూడు పార్టీలు కూడా వెనుకపడ్డాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలో ఐదో అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 36.5 శాతానికి పైగా ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 21.9 శాతానికి పైగా ఓట్లు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించింది. 4.5 శాతానికి ఓట్లు తెచ్చుకున్న సమాజ్‌వాది పార్టీ మూడో స్థానంలో నిలవగా, 4.3 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 2.06 శాతం ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది.ఈ జాబితాలో టీడీపీ 7వ స్థానంతో సరిపెట్టుకుంది. 1.9 శాతం ఓట్లతో టీడీపీ 7వ స్థానానికి పరిమితం అయింది. వైసీపీ 1,31,74,874 ఓట్లు సాధించగా, టీడీపీ 1,25, 69,179 ఓట్లను సాధించింది.
ఇక్కడ విశేషం ఏమిటంటే వైసీపీ కంటే ముందున్న నాలుగు పార్టీలు కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ ఓట్ల శాతాన్ని సాధించాయి. కానీ వైసీపీ సింగిల్‌గానే పోటీ చేసి ఈ ఘనత సాధించడం విశేషం. పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కన్నా వైసీపీ అధిక ఓట్లను సాధించడం, దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ మూడో స్థానంలో నిలిచింది. దీంతో ప్రజాబలం జగన్‌కే ఉన్నప్పటికి పొత్తుతో కలిసి పోటీ చేయడం వల్ల కూటమి అధికారంలోకి రావడం జరిగిందని ఈ ఘటనతో మరోసారి రుజువు అయింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications