టీడీపీకి ఓటు వేసిన వైసీపీ అభ్యర్థి..?
సాధారణంగా ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయమని అభ్యర్థులు ప్రజలను వేడుకోవడం మన చూస్తూనే ఉంటాం. తమ ఎన్నికల గుర్తు ప్రజలకు గుర్తుండేలా ఒకటికి పదిసార్లు చెబుతుండటారు. ఎవరూ కూడా ప్రత్యర్థికి ఓటు వేయాలని అనుకోరు. అలాంటిది తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి టీడీపీకి ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటు వేశారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది.
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముసునూరు ZPHSలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటేశారంటున్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటు వేసే సమయంలో ఆయన వెంట సిబ్భంది ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సైకిల్‌కి ఓటు వేయడం వాళ్లు చూశారని తెలుస్తోంది. అలానే ఈ విషయం బయట చెప్పొద్దు అని పోలింగ్ సిబ్భందిని కూడా ఆయన అనుచరులు బెదిరించినట్టు తెలుస్తోంది.

అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆయనే పోలింగ్ ముగిసిన తరువాత, తాను పొరపాటున టీడీపీకి ఓటు వేసినట్టు తెలిపారు.అయితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలనే ఇలా టీడీపీకి ఓటు వేశారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఆయన 4వేల కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే.. తనపై చర్యలుంటాయనే ఉద్దేశంతో ఆయన ముందు జాగ్రత్తగా టీడీపీకి ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోతుందని, అదే జరిగితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కచ్చితంగా జైలుకు వెళ్తారనే చర్చ స్థానికంగా జరుగుతోందని.. ఈ నేపథ్యంలో తాను కూడా టీడీపీకి ఓటు వేశానని టీడీపీ నేతలను భ్రమింపచేసి తాను బయట పడేందుకు ప్రీప్లాన్‌గా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications