వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి - వైసీపీ ఫిర్యాదు :ఎఫ్ఐఆర్ కోరిన సీఈసీ - ఎమ్మెల్సీ ఎన్నికలపైనా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రపతికి వైసీపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేయటంతో పాటుగా జగన్ పాలన పైన ప్రచురించిన పుస్తకాన్ని అందించారు. ప్రధాని.. కేంద్ర హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేయాలని భావించినా వారి అప్పాయింట్ మెంట్లు దొరకలేదు. దీంతో...బుధవారం ఫోన్ చేసిన హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. వైసీపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసారు.

సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ

సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ


ఇక, ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వైసీపీ పార్లమెంటరీ నేత విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం టీడీపీ పైన ఫిర్యాదు చేసింది. వారు చేసిన వ్యాఖ్యలను ఆధారాలతో వివరించింది. టీడీపీ నేతలు లోకేష్, బోండా ఉమ, దేవినేని, పట్టాభి వ్యాఖ్యల వివరంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని విజయ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న ఈ విషయాన్ని వివరించారు.

ఎఫ్ఐఆర్ కాపీలు కోరిన ఎన్నికల సంఘం

ఎఫ్ఐఆర్ కాపీలు కోరిన ఎన్నికల సంఘం


దీనిపై ఎన్నికల సంఘం విస్మయం వ్యక్తం చేసిందని సాయిరెడ్డి చెప్పారు. ఈ అసభ్య పదజాలాన్ని నాగరిక సమాజం సహించదన్నారు. పట్టాభి ఉపయోగించిన పదాన్ని ఉపయోగిస్తున్న తీరును వివరించారు. అనాగరికంగా వ్యవహరిస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రజాస్వామ్యం వివరిస్తున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరామని చెప్పారు. చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నారంటూ సాయి రెడ్డి ఆరోపించారు. దొంగల ముఠాను ఎన్నికలకు అనుమతిస్తే దేశం పరిస్థితి అధోగతి పాలవుతుందని చెప్పుకొచ్చారు.

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి

రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం ఉగ్రవాదులకు స్థానం లేదన్నారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారి పై కేసులు పెట్టారా అంటూ వైసీసీ నేతలను ఎన్నికల సంఘం అడిగింది. కేసులు నమోదు చేసామని చెప్పటంతో.. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నెంబర్లను తమకు పంపాలని ఈసి కోరింది. ఇదే సమయంలో ఏపీలో నిర్వహించాల్సి ఉన్న స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ సీట్లు...ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ చేపట్టాలని వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. దీని పైనా ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని విజయ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు.

English summary
YCP had met the EC and complained that TDP recognition should be revoked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X