వైసీపీకి బిగ్ షాక్.. మాచర్ల టీడీపీ ఖాతాలోకి..!
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ,మున్సిపాలిటీల్లో కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈక్రమంలోనే వైసీపీ పాగా వేసిన మున్సిపాలిటీలపై టీడీపీ కన్నేసింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో వైసీపీ కార్పోరేటర్లకు టీడీపీ కండువా కప్పడం జరిగింది.సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీకి చెందిన 24 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేసిన కార్పొరేటర్లు తాము టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ, పలువురు వైసీపీ కార్పోరేటర్లను తమ పార్టీలో చేర్చుకుంది.
రెండు రోజుల క్రితం ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఆరుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. బాలయ్య సొంత నియోజకవర్గంలో హిందూపురంలో కూడా పలువురు వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు.హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ తోపాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు.

పల్నాడు జిల్లా మాచర్లలో సైతం వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాచర్ల మున్సిపాలిటీపై టీడీపీ పట్టు బిగించింది. ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా.. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఛైర్మన్ మాచర్ల చిన్న ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో భేటీ అయ్యారు. చర్చల తర్వాత వీరు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉంటే.. 2022లో జరిగిన ఎన్నికల్లో మున్నిపాలిటీలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో మాచర్లలో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి.
కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు.. ఇప్పటికే 14 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు చేరితే టీడీపీ బలం 16కు చేరుతుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎన్నికల నాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. పాల్వాయిగేటులో ఈవీఎం పగులగొట్టిన కేసులో, అదే ఘటనలో టీడీపీ నేతపై హత్యాయత్నం చేసినందుకు మరో కేసు, అలాగే మరో ఘటనలో సీఐపై హత్యాయత్నం కేసు.. ఇలా వరుసగా కేసులు నమోదయ్యాయి. ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. కొద్దిరోజులు తాత్కాలికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications